SEETA JOSYAM by NARLA VENKATESWARA RAO Telugu book cover

SEETA JOSYAM

by NARLA VENKATESWARA RAO

₹130
In stock · 593 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Seeta Josyam By Narla Venkateswara Rao నాకు కావలసింది మీ ఆమోదం కాదు, మీలో ఆలోచన; నేను కోరేది మీ ప్రశంస కాదు, మీలో జిజ్ఞాస. ఎప్పటికప్పుడు పాత విషయాలను కొత్త దృష్టితో చూడ్డానికి మనం ప్రయత్నించాలి, పాత విశ్వాసాలను కొత్త పరీక్షలకు పెట్టుకోవాలి, పాత గాథలకు కొత్త వ్యాఖ్యానాలను చెప్పుకోవాలి. అప్పుడు గాని మనలో కొత్త చైతన్యం పెల్లుబకదు. అప్పుడు గాని కొత్త తేజస్సులో, ఓజస్సుతో ఒక జాతిగా మనం ముందుకు సాగలేము. మనలో స్తబ్దత పోవాలి, సంచలనం రావాలి; మనలో ఔదాసీన్యం గతించాలి, ఏదో ఒక పక్షం వహించాలన్న పట్టుదల పెరగాలి, మనలో 'విస్సన్నల' పట్ల, వారి 'వేదాల' పట్ల గౌరవం తగ్గాలి, తిరిగి 'ప్రశ్నోపనిషత్తులు' విరివిగా వెలువడాలి. నాటకాలను కూర్చి, వాటికి పీఠికలను చేర్చి, నేను సాధించగోరుతున్నది ఈ మానసిక పరివర్తననే, ఈ నవచైతన్యాన్నే, ఈ పురోగతినే. మీలో కొందరికి కష్టం కలిగించడం ద్వారానే నా లక్ష్యాన్ని సాధించవలసి వస్తే, అందుకు నేను వెనుదీయ ననడానికి నా నాటకాలే, వాటికి నా పీఠికలే తార్కాణాలు -నార్ల వెంకటేశ్వరరావు నార్ల రచనలు : జాబాలి • కదంబం • కొత్తాపాతా మూడు దశాబ్దాలు • నరకంలో హరిశ్చంద్రుడు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004