SEETARAM SAHITYAM VISHLESHANA VYASALU by PAGIDIPALLI VENKATESWARLU Telugu book cover

SEETARAM SAHITYAM VISHLESHANA VYASALU

by PAGIDIPALLI VENKATESWARLU

₹350
In stock · 3 available
PublisherPAGIDIPALLI VENKATESWARLU
LanguageTelugu
ఎక్కడ చూసినా సీతారామే! డా॥ అద్దంకి శ్రీనివాస్ సీతారాం కవిత్వం తన అస్తిత్వాన్ని కోల్పోవడంతో మొదలవుతుంది. అవిచ్ఛిన్నమైన భావధారతో కవిత్వమై ప్రవహించడం అత్యంత సహజసిద్ధంగా అబ్బిన గుణం. వచనాన్ని ఎలా కవిత్వీకరించాలో తెలిసి అభివ్యక్తి తాలూకు రహస్యతంత్రుల్ని మీటిన కవి ఇతడు. కవిత్వం రాయడానికి ఇతడెన్నడూ చాంద్రాయణవ్రతాల్లాంటివి చెయ్యడు. తనకు తానుగా ఏరి కోరి అసిధారా వ్రతాన్నే ఎంచుకుంటాడు. ఆ వ్రతం అందరికీ ఫలవంతం కాదు. తను నిల్చున్న చోటులోనే అరి పాదాల కిందనుంచి సమాజం జర్రున జారిపోతున్న వైనాన్ని అర్థం చేసుకొని, కుదేలైపోకుండా తాను నిలబడి తోటి వారిని నిలబెట్టడంలోనే సీతారాం నిట్టనిలువునా కవిత్వమై కరిగిపోయాడు. అసూర్యంపశ్యల్లాంటి సంఘటనలూ సన్నివేశాలు అతడి మేథో మస్తిష్కం పైనుంచి అలవోకగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నింటినీ పొదివి పట్టుకునే ప్రయత్నంలో తను స్పందించిన హృదయాన్ని వేదిక చేశాడు. ఆ వేదికే ఇలా శబ్దమై నినదిస్తోంది. ఎంత కాదనుకున్నా 'భావ స్థిరాణి జననాంతర సౌహృదని' అని అనక తప్పదనిపిస్తుంది. జడాత్మకమైన ప్రపంచానికి ఒక తొలకరిజల్లు సీతారాం కవిత్వం. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాలనో, సప్త సముద్రాల్నీ తాగెయ్యాలనో ఇతడు ఎప్పుడూ సాహసాలు చెయ్యడు. సాహసమెప్పుడూ అనిశ్చిత విజయాల్ని తనలో పొదువుకొని ఉంటుంది. అదికాదు సీతారాంకి కావలసింది. ఒక సునిశ్చితమైన స్వప్నలోక సాక్షాత్కారం. అది సాక్షాత్కారంతో సరిపుచ్చకూడదు. సాకారం కావాలి. ఆ సాకారం ప్రాకారాలు దాటి కొండకోనల్ని త్రోసి పల్లెల్లో కలిసి ప్రజల గుండెల్లో విలీనమైపోవాలి. అప్పుడే అభ్యున్నతి. అది సమాజ ప్రగతి. ఈ భావపరంపరలే సీతారాం కవిత్వానికి తాత్త్విక భూమికలు. కొందరిలో కొన్ని కోరికలే ఉంటాయి. కానీ సీతారాం కవిత్వం షట్కోణసంభరితం. అధ్యయనం, ఆచరణ, ఆవాహన, అభివ్యక్తి, అజరామరత, అఖండత అనే ఆరు కోణాలు ఇతని కవిత్వంలో కన్పిస్తాయి. సమస్యను గానీ, కవితా వస్తువును గానీ అధ్యయనం చెయ్యకుండా, దాన్ని ఆచరించకుండా, దానిని తనలోనికి ఆవాహన చేసుకోకుండా ముందుకు రాడు. సీతారాం సాహిత్యం (విశ్లేషణ వ్యాసాలు)