
SHADRUCHULU
by PITY PARKER
₹80
In stock · 59 available
PublisherPITY PARKER
LanguageTelugu
ISBN9789354195617
ముందు మాట ఏ కథైనా నీతిని ప్రబోధించాలి అన్న అరిస్టాటిల్ డిడాక్టిక్ సిద్ధాంతం నుండి ప్రారంభమైన కథలు అనేక వాదాలతో, విమర్శలతో పరిపరివిధాలుగా మారుతూ వచ్చింది. ప్రపంచంలో ఎన్ని భావజాలాలు మనిషిని నడిపించినా తర్కం అనేది ప్రధానం అని నేను నమ్ముతాను. తర్కం వలనే కథలు తమ గమనాలను మారుస్తూ, మార్చుకుంటూ వస్తుంది. కథ నీతి బోధించాలి అనే వాదం నుంచి కథ నీతి బోధించనక్కర్లేదు లేదా సమాజాన్ని మార్చనక్కర్లేదు అనే స్థాయికి వచ్చాము. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. రచయితలు సమాజాన్ని మార్చనక్కర్లేదు గానీ సమాజాన్ని మార్చే అర్హత తన కలానికి ఉంటుంది. ఆ అర్హతను గుర్తిస్తారా లేదా అనేది సదరు రచయిత ఇష్టం. ఒక్కోసారి వ్యక్తిగతం కూడానూ... స్నేహానికైనా. సంసారానికైనా, వ్యాపారానికైనా. సంస్థ నిర్వహణకైనా ఒకే రకమైన భావజాలం కలిగిన వారు దగ్గరికి రావాలి, చేరాలి లేదా మనం ఎంచుకోవాలి అని చెప్తుంటారు. ఒకే విధంగా ఆలోచించేవారంతా ఒకే చోట ఉంటే ప్రపంచం మొత్తం గుంపులు గుంపులుగా విడిపోయి. ఒక గుంపుతో మరొక గుంపు సంబంధం లేకుండా మానవ జీవనం ఉంటుంది. భూమి కూడా ఇలానే ఆలోచిస్తే తన చుట్టూ తాను తిరగడం. సూర్యుని చుట్టూ తిరగడం ఆపేస్తుందేమో అనిపిస్తుంటుంది. ఒక భావజాలం ఏర్పడాలన్నా, ఒక స్నేహం స్థిరపడాలన్నా, ఒక సంస్థ నిలబడాలన్నా, ఒక ప్రేమ చిగురించాలన్నా, ఒక సంసారం సాగాలన్నా. ఒక సంస్థ ఫరీడవిల్లాలన్నా విరుద్ధ భావజాలాల మధ్య ఎప్పుడూ పరస్పర సంఘర్షించుకుంటూ ఉండాలి. సృష్టికి మూలం విమర్శ. ఈ పరస్పర సంఘర్షణ నుండి వచ్చే విమర్శ వల్లే సమస్యకు సరైన సమాధానం లభిస్తుంది అనేది నా సంపూర్ణ నమ్మకం.