
SHAKESPEARE NATAKA KATHALU
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹90
In stock · 5 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Shakespeare Drama Stories - GVL Narasimha Rao నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తనన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వ విఖ్యాత నాటకకర్త విలియమ్ షేక్స్పయర్. 1564 ఏప్రిల్ 23 ను లండన్కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్ఫర్డ్ ఎవాన్ పట్టణంలో జన్మించారు. 1616 ఏప్రిల్ 23న మరణించారు. తండ్రి చర్మపరిశ్రమకు చెందిన వ్యాపారి. షేక్స్ పియర్ నటుడు, నాటకకర్త, కవి. నాటకకర్తగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. మోదాంత, విషాదాంత, చారిత్రక నాటకాలను రచించారు. ఈ నాటక కథలను జివిఎల్ నరసింహారావు సరళంగా, సుబోధకంగా తెలుగులో అనువదించి మీకు అందిస్తున్నారు. నరసింహారావు గతంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా పిల్లలకోసం 'నచ్చే మెచ్చే కథలు' నాలుగు సంపుటాలు, నూరు కథలతో 'కథాశతకం'ను అందించారు. సీనియర్ పాత్రికేయులు, రచయిత నరసింహారావు కలం నుంచి జాలువారిన ఈ కథానువాదం మిమ్ములను అలరిస్తుందని ఆశిస్తున్నాం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 షేక్స్ పియర్ నాటక కథలు