
SHILLANGERI KATHALU - 70
₹70
In stock · 563 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
SHILLANGERI KATHALU (Children's Stories with Illustrations) by Kolar Krishnaiyer “శిళ్ళంగేరి అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు' అంటూనో లేక 'శిళ్ళంగేరి అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు' అంటూనో చాలా కథల ప్రారంభం ఉంటుంది. ఇలా శిళ్ళంగేరిని పట్టణంగానూ, దేశంగానూ కూడా చేసి కథలు రాసి ఆ ఊరికి వ్యాప్తిని కలిగిస్తారు కోలార్ కృష్ణయ్యర్గారు. ఈ ఊరి పేరు చదువుతూ ఉంటే ఎంతో వింతగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ శిళ్ళంగేరి అనే ఊరు కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఊరు. కృష్ణయ్యర్గారు పూర్వీకుల ఊరు. ఆ ఊరిని ఇలా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆయన. కృష్ణయ్యర్గారు పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ అనంతపురంలో. బి.ఏ. దాకా చదివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జిల్లా లోకల్ఫండ్ ఆడిట్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. కథలు రాయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పురాణ, ప్రబంధ, చారిత్రక, ఇతిహాస, సాంఘిక, జానపద కథలెన్నో రాశారు. వీరి రచనలు చందమామ, బాలజ్యోతి, బుజ్జాయి, బాలభారతి మొదలైన బాలల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకూ 300 కథలు పైగా రాసి ప్రచురించారు. 'ఇంద్రధనుస్సు, చీకటి వెలుగు' అనే కథల సంకలనాలు ప్రచురించారు. చిన్న చిన్న మాటలతో పెద్ద భావాలను ప్రకటింపగల నేర్పు వీరికున్నది. ఈ కథలన్నీ పిల్లలనే కాక పెద్దలనూ అలరిస్తాయి. 'కథ చెప్పటంలో ఒక్క అనవసరపు మాట కూడా లేదు. ప్రతి కథలోనూ ఏదో ఒక నీతి ఉంటుంది' అని మెచ్చుకున్నారు ప్రఖ్యాత సాహితీవేత్త ఆచంట జానకీరామ్ గారు. వీరి కథల్లో నీతి, సందేశం, ప్రబోధం అన్నీ కలగలిసి ఉంటాయి. చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్