SHILPA DEEPIKA by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

SHILPA DEEPIKA

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
మైసూరు మహారాజగురు శివయోగి శిల్పసిద్ధాంతి శ్రీశ్రీశ్రీ సిద్ధలింగస్వాములవారు శైవబ్రహ్మర్షి శిల్పగురుకులం నెలకొల్పి వందలాది సంప్రదాయ శిల్పులను తయారు చేశారు. అక్కడ చదువుకునే విద్యార్థుల కోసం వారు శిల్పవిద్యారహస్యోపనిషత్తు, శిల్పసారం, శిల్పాదర్శ మొదలైన గ్రంథాలు వెలువరించారు. ఆ శిల్పాదర్శ గ్రంథమే 'శిల్పదీపిక' పేరుతో తెలుగులో అనువాదమైన ఈ పుస్తకం. ఇందులో శిల్పశాస్త్ర అధ్యయనం చేసే విద్యార్థులకు ఉపయుక్తమైన అనేకమైన అంశాలున్నాయి. ముఖ్యంగా ఆచార్యవరణం, ఆచార్య, స్థపతి, వర్ణకి, తక్షక,సూత్రగ్రాహి మొదలైనవారి లక్షణం, మానసాధనం, భూపరీక్ష, ఆయదిలక్షణం, దిక్పరిచ్ఛేదజ్ఞానం, గృహారంభ ముహూర్తనిర్ణయం, దేవాలయ స్థాననియమాలు, రాజధాని శాలాస్థాన నిర్ణయం మొదలైన అనేక విషయాలు ఉన్నాయి. సంస్కృతమూలం కన్నడానువాదంతో ఉన్న పుస్తకాన్ని శిల్పకళాభారతి వ్యవస్థాపకులు ఆచార్యవిశ్వకర్మ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మ సంపాదించగా తెలుగుపాఠకుల కోసం కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య అనువదించారు. శిల్పశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలి.