SHILPAM CHEPPINA KATHA (SRISAILA SHILPALU) by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

SHILPAM CHEPPINA KATHA (SRISAILA SHILPALU)

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹120
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
శ్రీశైలం దర్శించినవారంతా ఆలయ శిల్పాన్ని తప్పక పరిశీలించాలి. ప్రాచీనకాలం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలంలో వివిధ నిర్మాణాలు చేపట్టాయి. అపురూపమైన శిల్పసంపదను శ్రీశైల మహాలింగ చక్రవర్తి పరం చేశాయి. వేలాదిమంది శిల్పులు వివిధ కాలాల్లో ప్రదర్శించిన అపురూప శిల్పనిర్మాణ చాతుర్యమంతా శ్రీశైలంలో రాశి పోసుకుంది. శ్రీశైల శిల్పకళావైభవంలో ప్రాకార శిల్పాల పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆలయంలోకి వచ్చే భక్తులు ముందుగా దర్శించేది ప్రాకార శిల్పాలనే. ఈ ప్రా ప్రాకారాలు విజయనగర కాలంలో నిర్మితమయ్యాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ప్రాకార కుడ్యాలపై చెక్కిన వందలాది అపురూప శిల్పాలు పరమ శివుని యొక్క లీలలు తెలియజేస్తూ భక్తుల హృదయాల్లో స్థిరంగా నాటుకు పోతాయి. శ్రీశైల ప్రాకార శిల్పాలు చెప్పే కథలను ముచ్చటగా చెబుతున్న పుస్తకమిది. ఆయా శిల్పాల రేఖాచిత్రాలను పొందుపరచడమే కాకుండా... శ్రీశైల ప్రాకారంపై శిల్పాలను గుర్తుపట్టేందుకు వీలుగా తగినంత సమాచారం కూడా పొందుపరచటం. ఇందులో పన్నెండు గాథలున్నాయి.