
SHIVADHARMA SASTRAM
by DR.AMBADIPUDI NAGABHUSHANAM
₹400
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
శివధర్మశాస్త్రం అజ్ఞానం అనే సముద్రంలో మునిగిపోయిన జీవకోటికి అందరికీ ఈ శివధర్మం తెప్పలాంటిది. దీనిని తెలుసుకుని, తాత్పర్యంతో ఆచరించేవాడు జ్ఞాని అవుతాడు. జ్ఞానంవల్ల మోక్షాన్ని పొందుతాడు. ఉత్తమమైన ధర్మాలు అన్నింటిలోనూ ఉత్తమమైన ధర్మం శివధర్మం.... అని సాక్షాత్తూ పరమశివుడే చెప్పాడు. ఇదొక ధర్మశాస్త్రమూ ఉపపురాణమూ కూడా. పన్నెండు అధ్యాయాలు కలిగిన ఈ మహాగ్రంథం శివభక్తులకు పరమప్రామాణికం. ముఖ్యంగా లింగోద్భవాన్ని గురించి, లింగార్చన విధులను గురించి.... శివలింగ మహావ్రతాన్ని గురించి ఈ గ్రంథంలో చదివి తెలుసుకోవచ్చు. దీనిని సంస్కృత మూలశ్లోకాలతో పాటు... అంబడిపూడి నాగభూషణం గారు తేటతెలుగులో రచించిన తాత్పర్యాలతో కలిపి అందిస్తున్నాం. శివాగమ జ్ఞానవాహిని పక్షాన మేం అందిస్తున్న ఈ అపురూప కానుకను తెలుగు పాఠకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం. శివ మాదౌ శివం మధ్యే శివమస్తే చ సర్వదా । సర్వేషాం శివభక్తానా మనుగానాం న శ్శివమ్ ॥ శివాగమ జ్ఞానవాహిని శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం, ధర్మగిరిలో 1998 - 2007 మధ్య శైవాగమాన్ని అధ్యయనం చేసిన సహవిద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే శివాగమ జ్ఞానవాహిని. శైవాగమానికి సంబంధించిన ముఖ్యగ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురించడం, శైవాగమ విద్యార్థులకు ఉచితంగా ఆ గ్రంథాలను అందజేయడం అనే ప్రధాన లక్ష్యాలతో పని చేస్తున్నది. ఇంతవరకూ శైవాగమ నిత్యపూజా లక్షణ సంగ్రహం, శివాలయం, కారణాగమం చెప్పిన నిత్యార్చన, శివానందలహరి, శివనామం శివరూపం, నమశ్శివాయ రగడ వంటి గ్రంథాలను ప్రచురించింది. త్వరలో ప్రతిష్ఠ (అష్టాదశ క్రియలు), శివాలయ ఉత్సవాలు గ్రంథాలను ప్రచురించబోతోంది.