
SHIVALAYA NITYA POOJA VIDHI
by NANDIVELUGU SRI BALAJI GURUKKAL
₹150
In stock · 10 available
PublisherNANDIVELUGU SRI BALAJI GURUKKAL
LanguageTelugu
శివపూజతో సమానమైనది లేదు. శివపూజ సకలపాపాలను హరిస్తుంది. సకలలోకాలకు సుఖమునిస్తుంది. సకల దానఫలితాన్ని, సకల యజ్ఞఫలితాన్ని కలిగిస్తుంది. సకల దోషములనుండి దూరం చేస్తుంది. శివపూజ జయప్రదం, కల్యాణకారకం, రాష్ట్ర వృద్ధికరం, శత్రునాశనకరం. ఈ భూమిపై ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే పూజ ఒక్క శివలింగార్చనే. పగలు, రాత్రి కలిపి ఒక రోజులో నాలుగు రెళ్లు ఎనిమిది జాముల్లో శివపూజ చేయాలి. మానవులకు నిద్ర అవసరం కనుక శివపూజను ఆరుకాలాలకు పరిమితం చేశారు. ఆరుకాలాల నుంచి ఏకకాల శివార్చన వరకు ఆగమాలు అనేక పద్ధతులను నిర్దేశించాయి. నేటికీ చాలా శివాలయాల్లో షట్కాలశివార్చన జరుగుతూనే ఉంది. ఈ శివపూజ ఇంట్లో ఆచరిస్తే ఆత్మార్థపూజ అంటారు. ఆదే ఆలయంలో ఆచరిస్తే పరార్థపూజ అంటారు. అనుబంధంగా ఆగమీకులు కొన్ని ముఖ్యమైన ఉత్సవాల్లో పఠించే అరుదైన ఆగమ ఆశీర్వచన గద్యం కూడా ఈ పుస్తకంలో ఉంది.