SHODASA GANAPATHI POOJA VIDHANAM by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

SHODASA GANAPATHI POOJA VIDHANAM

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
భారతీయ ప్రాచీన వాఙ్మయములో వేదములు, ఆగమములు రెండు నిగమాగమములుగా విఖ్యాతి పొందాయి. సనాతన ధర్మ పరిరక్షణలో ఎందరో మహానుభావులు ఈ యొక్క సంస్కృతి సంపదలను కాపాడి మన హైందవ సంస్కృతిని సుసంపన్నం చేశారు. విగ్రహారాధన త్రేతాయుగంలో ప్రారంభమైనప్పటికి కలియుగంలో విశేషమైన ప్రాచుర్యాన్ని సంతరించుకొని సామాన్య భక్తులను కూడా ఆకర్షిస్తున్నది. అందులో భాగంగానే ఎన్నో వ్రతాలు, పూజలు మొదలైన వాటి రూపంలో మనం ఎన్నో పండుగలను జరుపుకుంటున్నాం. దానికి సంబంధించినదే ఈ గ్రంథము. గణపతిని గూర్చి తెలియనివారున్నారంటే ఆశ్చర్యమే. చిన్న పిల్లల నుండి పెద్దల దాక అందరికి ఆరాధ్యదైవం ఆయన. ఆ గణపతి స్వరూపములు పదహారుగా శైవాగమములో చెప్పబడి ఉన్నది. ఇందులో బాలగణపతి మొదలు కొని ఊర్ధ్వ గణపతి వరకు వీరందరు నిత్యం మనకు ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతున్నారు. ఇలా షోడశ గణపతులను ఆరాధిస్తే వచ్చే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. వాటినన్నింటిని శైవాగమములో చెప్పబడిన ప్రకారముగా కూర్చినదే ఈ గ్రంథము. దీనిని గ్రంథ లిపిలో సంస్కృత భాషనుండి సంపాదించి శ్రీ కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య తెలుగులో అందిస్తున్నారు. దానిని మాయొక్క కామాక్షిదేవి పూజా పీఠ ధార్మిక ప్రచురణల పేరిట ముద్రించి ఆశేష భక్తకోటికి అందిస్తున్నామని తెలుపుతూ అనేక మంగళాశాసనములు అందించుచున్నాము.