SIMHA PRASAD 125 BAHUMATHI KATHALU by SIMHAPRASAD Telugu book cover

SIMHA PRASAD 125 BAHUMATHI KATHALU

by SIMHAPRASAD

₹600
In stock · 33 available
PublisherSRI SRI PRACHURANALU
LanguageTelugu
‘అద్వితీయ' సృజన తేజస్వి శతాధిక కథలకూ కొన్ని నవలలకూ నాటకాలకూ అనన్య సామాన్యమైన cm ప్రతిష్టాత్మక పురస్కారాలూ, బహుమతులూ పొంది అత్యంత ప్రసిద్ధినీ అసంఖ్యాక ప్రశంసల్నీ గడించుకున్న తొలిపంక్తి రచయిత సింహప్రసాద్. విశిష్ట ప్రతిభామూర్తిగా 'వివాహవేదం' (హిందూ వివాహ విజ్ఞాన సర్వస్వం) 'తిరుమల దివ్యక్షేత్రం' (తిరుమలేశుని సమగ్ర సమాచార దర్శిని), ఉద్గ్రంథాలను వెలయించి, సాకల్యమైన తన గవేషణాధిషణతో ఉత్తమ పరిశోధకునిగా కీర్తి సాఫల్యాన్ని గడించుకున్న అరుదైన రచయిత సింహప్రసాద్. ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం, సామాజికాభ్యుదయం- సాహిత్య పరమోత్తమమైన ప్రయోజనమనే నిబద్ధతతో, ఉన్నత మానవీయ విలువల పరిరక్షణే రచనా నిమగ్నతగా తెలుగు సాహిత్య సృజన చేస్తున్న ఈనాటి 'అద్వితీయ' రచయిత సింహప్రసాద్. బహుమతుల రాశిలో తనదైన అసాధారణ 'రికార్డు'తో, వాసిలో తనదైన శైలీశిల్ప విశిష్టతతో తెలుగు నేల నాలుగు చెరగులా పర్యాప్తమైన అక్షరదీప్తి సింహప్రసాద్. వ్యక్తిత్వ చైతన్యానికి నిలువెత్తు సంతకంగా, సాహిత్య వ్యక్తిత్వ కీర్తికి స్ఫూర్తి పతాకగా పురోగమిస్తున్న రచయిత సింహప్రసాద్. ప్రక్రియా పరంగా ఈ ‘125 బహుమతి కథలు' సంపుటి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ఏకైక కథా దర్శనం! ఒకే రచయిత విజయ సాఫల్యంగా అత్యధిక సంఖ్యలో కథలకు సాధించిన బహుమతుల్ని ప్రపంచ రికార్డుగా నమోదు కోసం దరఖాస్తు చేయబోతున్న శుభసందర్భంలో హృదయపూర్వక అభినందనలు! శుభాకాంక్షలు! - విహరి