SIMHA SENAPATHI by RAHUL SANKRITYAYAN Telugu book cover

SIMHA SENAPATHI

by RAHUL SANKRITYAYAN

₹200
In stock · 298 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రవేశిక వైశాలి ప్రజాతంత్రాన్ని గూర్చి వ్రాయబడిన వివరాలు చాలా కొద్ది. నాకు వాటిని చదువుతూంటే మరికొంత తెలిస్తే బావుండు సనిపించేది. నా మిత్రులలో కొందరు భూత - ప్రేతాలను నమ్మేవారున్నారు. మరణించిన వారి ఆత్మలు శరీరాలను వదలి ప్రేతలోకంలో మన చుట్టూ తిరుగుతూ వుంటాయనీ, వాటితో మాట్లాడే మహానుభావులున్నారనీ వారి విశ్వాసం. అసలు ఆత్మయందే నమ్మకంలేని నాకు మరి ఆ ప్రేతాత్మలయందు, వాటి లోకంపైన విశ్వాసం యెలా వుంటుంది? అయినా హరసూరామ్ బ్రహ్మా నారాధించే బాబూరామదాస్ గౌడ్ను పరీక్షించడానికి నేను దీనినొక అవకాశంగా తీసుకున్నాను. వైశాలి ప్రజాస్వామికానికి చెందిన కొన్ని పేర్లు ఆయనకు చెప్పి వారిలో ఎవరినైనా పిల్చి వైశాలి ప్రజాతంత్ర చరిత్రను గూర్చిన వివరాలు తెలుసుకోమన్నాను. అలా చేస్తే యికనుంచి నా కలం ఆయన ప్రేతవిద్యను గూర్చి తీవ్ర ప్రచారం సాగించుతుందన్నాను. కాని, ప్రేతాత్మ కల్లబొల్లి మాటలు వాగితే నా వద్ద గీటురాయి వున్నదనే సంగతి జ్ఞాపకం వుంచుకోమని హెచ్చరించాను. అందుకు గౌడ్తో యేమేమిటో చెప్పుకొచ్చాడు. తుదకాయన మాటల సారాంశం 'భూత ప్రేత విద్య గ్రుడ్డివాళ్ళు, ధనవంతుల కోసమే'నని తేలింది. భూత వైద్యము ప్రేత విద్య ఎలాంటి బూటకాలో చెప్పటానికే యిక్కడీ విషయాన్ని తెచ్చాను. కొన్ని సంవత్సరాలకు - గౌడీ జీవితం చాలించిన తర్వాత ఒక అసాధారణ విషయం జరిగింది. బాల్యంనుండి పేద రైతు కుటుంబీకులైన నా తల్లిదండ్రులకట్టి సామర్థ్యం లేకపోయినా - నన్ను సుకుమారంగా పెంచటానికి ప్రయత్నం జరిగింది. సుకుమారత్వం మహాపాతకమని, బంగారంలాంటి శరీరాన్ని మన్ను చెయ్యాలంటేనే ఆ పాపాన్ని మూటకట్టుకోవాలనీ అప్పట్లో నాకు మాత్రం ఏం తెలుసు? నాకా జ్ఞానం కలుగునప్పటికే పిట్టలు దాదాపు చేలో గింజలన్నీ యేరుకొని తినివేశాయి. అయినా ఇప్పుడు - మంచి వయస్సులో - కాలుమీద కాలేసుకొని కూర్చోవటం నాకిష్టంలేదు. నేను నిత్యము