SIMHAVALOKANAM by AALURI BHJANGARAO Telugu book cover

SIMHAVALOKANAM

by AALURI BHJANGARAO

₹275
In stock · 123 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
క్రితం సంవత్సరం (1981) జనవరిలో 'సింహావలోకనం' మొదటి భాగాన్ని ప్రకటించాను. సరీగా సంవత్సరానికి ఈ జనవరి (1982) చివర్లో రెండవ భాగాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరకాలంలోనూ ఎన్నో తీపి అనుభవాలూ, మరెన్నో చేదు అనుభవాలూ - ఎదురయ్యాయి. ఎందరో పాఠకులు తమ అమూల్యమైన లేఖలతో నాకు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. నేను ఆశించినంతగా పాఠకుల్నుంచి, అభిమానుల్నుంచి ప్రోత్సాహం లభించింది. 'సింహావలోకనం' మొదటి భాగాన్ని చదివి ముందుగా నాకు జాబు రాసినవారు మిత్రులు ఎ.ఎన్. నాగేశ్వరరావుగారు. 'సింహావలోకనం' రచన అద్భుతమైంది. అందులో సందేహం లేదు. అనువాదం బాగానే వచ్చింది.... మొత్తానికి పుఠం పెట్టినట్టు చాలా రోజులకైనా ఒక మంచి పుస్తకాన్ని అందించారు" అని రాశారు. అప్పటివరకూ పాఠకుల స్పందన ఎలా వుంటుందోనని బిక్కుమంటూన్న నాకు వారి జాబు ఊరట కలిగించింది. ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సుప్రసిద్ధ సినిమా నటులు శ్రీ కాకరాలగారు ఇలా రాశారు. “సిసలైన స్వాతంత్య్ర మహాయజ్ఞానికి స్వీయ చైతన్యంతో సమిథలయిన వారి జీవితాలకు అద్దంపట్టడంతోపాటు ఆ యజ్ఞ ఫలితాన్ని దిక్కుమళ్ళించిన రాజకీయ అవలక్షణానికి అన్ని విధాలా అద్దం పట్టింది.” ఈనాడు దినపత్రిక ఇలా రాసింది. “మనదేశంలో జరిగిన సాయుధ విప్లవాలకు సంబంధించి చెప్పకోదగిన రిఫెరెన్సు పుస్తకంగా 'సింహావలోకనం' ఉపయోగపడుతుంది. 'సింహావలోకనం' మిగిలిన రెండు భాగాలు కూడా తెలుగులో వెలుగు చూడాలని పాఠకులు కోరుకునేలా ప్రభావితం చేయగల సత్తా ఈ పుస్తకానికి వుంది." ప్రజాశక్తి ఇలా వ్రాసింది. "ఈనాటి యువతరానికి తెలియని అనేక అత్యద్భుత సాహసకృత్యాలతోనూ, రహస్యాలతోనూ నిండివున్న ఈ గ్రంథం నేటి యువతరాన్ని ఎంతగానో ఉత్తేజ పరచగలదు.