SINGAMANENI NARAYANA GNAPAKALALO by SINGAMANENI NARAYANA Telugu book cover

SINGAMANENI NARAYANA GNAPAKALALO

by SINGAMANENI NARAYANA

₹200
In stock · 10 available
PublisherSINGAMANENI NARAYANA
LanguageTelugu
“రంగయ్యా ! దేశంలో సరుకులు తయారుచేసే వాళ్ళంతా వాళ్ళ సరుకులకు వాళ్ళే రేటు నిర్ణయం చేసుకుంటారు. సబ్బులు తయారు చేసేవాళ్ళు మా సబ్బు రేటింతంటారు. బట్టలు తయారు చేసేవాళ్ళు మాబట్ట రేటింతంటారు. ఎరువులు తయారు చేసేవాళ్ళు మా ఎరువుల రేటింతంటారు. చెప్పులు తయారు చేసేవాళ్ళు మా చెప్పుల రేటింతంటారు. వానికి ఇష్టం వచ్చినట్లు వాడు అమ్ముకుంటాడు. కానీ రంగయ్యా ! మన రైతు దగ్గర కొచ్చేసరికి మనం పండించే పంటకు రేటు మనం చెప్పుకొనేకి లేదు. ఏ వ్యాపారస్తుడో చెప్పల్ల. ఏ గవర్నమెంటో చెప్పల్ల ! హైదరాబాదు గవర్నమెంటు చెప్పుతుందో, ఢిల్లీ గవర్నమెంటు చెపుతుందో, నాగపూర్ మార్కెట్టు చెపుతుందో, మద్రాసు మార్కెటు చెపుతుందో - మనంమాత్రం చెప్పుకొనేకి లేదు. మన ఇష్టం వచ్చినట్లు అమ్ముకొనేకిలేదు. వాళ్ళకోన్యాయమూ - మనకోన్యాయమా? ఇంతకంటే అన్యాయం ప్రపంచంలో ఎవ్వరికైనా జరుగుతుందా? మన రైతుకు తప్ప.” (సింగమనేని నారాయణ : 'అడుసు' కథలో నారాయణప్ప ప్రశ్న)