SIRISILLA SIRIMALLELU by DEVATHA SUDHAKAR Telugu book cover

SIRISILLA SIRIMALLELU

by DEVATHA SUDHAKAR

₹20
In stock · 1 available
PublisherDEVATHA SUDHAKAR
LanguageTelugu
నా మాట సిరిసిల్ల సిరిమల్లెలు పేరుతో వస్తున్న ఈ పాటలకు నేను రచయితను కాను. సిరిసిల్ల మట్టిలో పుట్టిన ఈ సిరిమల్లెల్ని సేకరించి దండగా గుచ్చి సిరిసిల్ల మట్టితల్లి పాదాలకి అందిస్తున్న పాట పూజారిని మాత్రమే. ఇందులో కొన్ని పాటల్ని నా శక్తి కొలది జానపద బాణీలోనే సభల్లోను, కేసెట్లలోను పాడి వినిపించే అదృష్టం కలిగింది. సహజమైన జానపదుల స్వరాల మెళుకువల్ని ఇప్పుడిప్పుడే ఒంట పట్టించుకొని, గొంతు సవరించుకొంటున్న పల్లెపాట బాటసారిని మాత్రమే. ఇందులోని అన్ని పాటల్ని వాళ్ళ వాళ్ళ గొంతుల ద్వారా నా చిన్నతనము నుండి నేటి దాకా నా మనసు కెక్కించిన హనుమక్క, ఆదిరెడ్డి సారు, మిద్దె రాములు (ఒగ్గు కథ కథకులు) ఇంకెందరో ఒలికించిన పలుకు ముత్యాలివి. అవన్నీ మొన్న కేసెట్లలోను, నేడు ఈ పుస్తకంలోనూ రాశిగా పోసిన పాట తోటమాలిని మాత్రమే. ముందుగా నా గొంతుకు జానపద పాట భిక్షపెట్టిన మా అమ్మ, బాపులకి ఋణపడి పోతున్నాను. జానపదాల్లో ఓనమాలు నేర్పిన గురువు కీ॥శే॥ సుద్దాల బాలయ్యకి, నా పాటకు గజ్జెకట్టి వేదికలెక్కిచ్చిన అన్న కీ॥శే॥ రుద్రరవికి, ఇంకెందరో సాహితీ మిత్రులకి కృతజ్ఞుడిని. ఎంతో దయతో ఈ పుస్తకానికి పేరు పెట్టి నాకు అక్షరాల ఆశీస్సులను అందచేస్తున్న మహాకవి, గేయకవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణరెడ్డి గారికి ప్రణామాలు. నా ప్రయత్నాన్ని అభినందిస్తున్న పూజ్యకవి ఆచార్య ఎన్. గోపి, తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గారికి, తెలంగాణా తొలితరం కథా రచయిత శ్రీ గూడూరి సీతారాం గారికి, సినీకవి అన్న సుద్దాల అశోక్ తేజ గారికీ, తెలుగు విశ్వ విద్యాలయం జానపద కళల శాఖాధిపతి చిగిచర్ల కృష్ణారెడ్డి గారికి, మిత్రుడు పత్తిపాక మోహన్కి కృతజ్ఞతలు. ఈ పుస్తక ముద్రణకు ఆర్థికంగా సహకరించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి... పాటల సేకరణలో సహకరించిన వారందరికి... జానపద కళాకారులకు, మిత్రులకు... అందంగా ఫోటోలు అందించిన ఏలె లక్ష్మణ్ గారికి అందంగా ముద్రించిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాద్ వారికి హృదయపూర్వక కళాభివందనములు.