
SMASHANAM DUNNERU - KESAVAREDDY
₹120
Currently out of stock
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696107
హరిజనులమీద పెత్తనం చెలాయించినంత మాత్రాన, వారి మీద చీటికీ మాటికీ నోరు పారేసుకున్నంత మాత్రాన తాము పెత్తందారులయిపోరు. పెత్తందారులకు తొత్తులుగానే మిగిలిపోతారు. తమ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తే తొత్తుల్ని కూడా వెంటాడి వేధిస్తారు అదే పెత్తందారులు. బి.సి. కులాల సహకారం తీసుకుంటూనే హరిజనుల్ని అణచివేసే భూస్వామ్యపు అహంకారం, స్వార్థం, కుటిల వ్యూహంలోని ఎత్తుగడలు అర్థమవుతాయి ఈ నవల చదివితే. ముఖ్యంగా పీడితకులాల్లోని అంతర్గత వైరుధ్యాల్ని తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా రెచ్చగొట్టడమనే పద్ధతి ఈనాటికీ కొనసాగడం వర్తమాన సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని గమనించినవారికి తేటతెల్లంగా కనిపిస్తోంది. అందుకే స్మశానం దున్నేరు నవల కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఒకనాటి జీవితాన్ని రికార్డు చేసిన నవల మాత్రమే కాదు, దానికి సామాజికపరమైన ప్రాసంగికత వుంది.