SODDA KANKI by KOTHAPALLI RAMANJANEYULU Telugu book cover

SODDA KANKI

by KOTHAPALLI RAMANJANEYULU

₹200
In stock · 43 available
PublisherKOTHAPALLI RAMANJANEYULU
LanguageTelugu
అది ఒక పల్లెటూరు. పాడిపశువులు సంవృద్ధిగా ఉన్నటువంటి ఊరు. నిత్యం రైతులు, రైతుకూలీలు పొలంపనులు చేస్కుంటూ, జీవించేవారు. అన్ని జాతుల వారు జీవించే మంచి హృదయులు ఉండే పల్లె అని ఆ గ్రామానికి పేరు. 'అదే కొత్తపల్లి, అది 16వ శతాబ్దంలో వెలసిన పల్లె. ఆ ఊరు ప్రజలు మంచి పరాక్రమవంతులుగా పేరు గాంచిన వారు. ఈ గ్రామం భైరవేశ్వరుడు వెలసి ఉన్న గడ్డ, ఈ బైరాగడ్డ, భైరవుడు ఉండే గడ్డ. దీని పెద్ద బైరాగడ్డ అనే వారు. దానికి ఉత్తర భాగాన ఉండే దానిని చిన్న బైరాగడ్డ అని వాడుకగా పిలుచుకొనేవారు. ఆ భైరవుడు ఉండే దాని వల్లనే ఆ ఊరు ప్రజలకి అంత ధైర్యం. ఆ ఊరు నీళ్ళు తాగిన వారెవరైనా బలవంతులు అని చెప్పేవారు ప్రజలు. ఆ ఊరు రైతులు ఆరుద్ర కార్తె వస్తే చాలు. పసుపు, బౌద్ధ పైర్లు తప్పకుండ వేస్తూ ఉంటారు, మరికొందరు ఆకుతోట పోస్తారు. సుగంధం, అరటి చెట్లు వేస్తారు. ఈ సుగంధం, అరటి ఆకులు విస్తర్లకు ఆ నాడు మంచి గిరాకి ఉండేది. బయటివారు వచ్చి అరటి మరియు తమలపాకుల వ్యాపారం చేసేవారు. పసుపులో కలుపు తీసేటప్పుడు అందరు ఒక తూరి పూనుకుంటే కూలీలు చిక్కరు. ఇది ఇలాగా ఉండగా, 1970 దశకంలో ఇక్కడ జరిగిన సంఘటన ఒకటుంది. ఆ ఊరికి ప్రక్కన తీగల వాగు ఒకటుంది. ఆ వాగులోని మడుగులో నీరు ఆ కాలంలో ఏనాడు ఇంకిపోదు అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామంలో ఈత చెట్ల పొదలు దట్టంగా అల్లుకొని ఉండేవి. మామిడి చెట్లు ఆకాశానికి ఎగబాకినట్లు అనిపించేవి. రావి చెట్లు అయితే బెరీగా ఉండేవి. వాటిని భేరి రావి మాకులు అని పిలిచేవారు. పొద్దున్న సాయంత్రం ఆడ మగ పిల్ల పెద్దలు ఆ మానుల కింద కూర్చొని కబుర్లు చెప్పుకొని పోయేవారు. గడ్డికి, కలుపు తీయడానికి పోయేవారు. సద్ది అన్నం ఎత్తుకొని పోయేవారు. సంగటి తట్టలు మోసుకుపోయేవారు. ఎప్పుడు జనం పోతూ వస్తుండేవారు. విరామం ఉండేది కాదు. కపిల తోలే వారు మడక దున్నే వారు, బండి కట్టి తోలుకొని పోయేవారు, మరి ప్రతి బావి దగ్గర కీర్ కీర్మని