
SONS OF ANIMALS
by Y.R.CHANDRA
₹150
In stock · 480 available
PublisherY.R.CHANDRA
LanguageTelugu
ఈ నవల గురించి.... “ఒక ముఖ్యమంత్రి లక్షకోట్లు దోచుకుని దాచుకుని పోయాడన్నా.... ఒక ప్రతిపక్ష నాయకుడు పదివేల కోట్లు దాచుకున్నాడన్నా.... అధికారుల్లో అవినీతిపరులకు, పోలీసుల్లో దొంగలకి, ఉద్యోగుల్లో లంచగొండులకు, మోసగాళ్లు, వేషగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళలో పన్ను యెగవేతదారులకి, అన్నీ అడ్డదారుల్లో ముందుకొచ్చిన మరేందరికో అందివచ్చే దొంగతనాలు దోపిడీలు హత్యలు అరాచకాలు మానభంగాలు మాదకద్రవ్యాలు మారణాయుధాలు వ్యభిచారాల్లో అన్ని అమ్మకాలు కొనుగోళ్ళలో, సులువుగా చేతులు మారే డబ్బుయొక్క భౌతిక స్వరూపం, దానిలోని విచ్చలవిడితనం అది లెక్కలకందకుండా చేతులు జారిపోయే అక్రమ విధానక్రమమే.... దేశప్రజల అష్టకష్టాలు అష్టదరిద్రాలు ఆకలి చావులు ఆత్మహత్యలకు ప్రధాన కారణ.... "భూతాలైన" రాజకీయ ఉద్యోగ దళారి వ్యాపార వర్గాల చేతుల్లోంచి, ఆకాశమంత యెత్తులో భారీగా పెరిగిన అవినీతి “మహావృక్షం”. దాని పట్టుకొమ్మల్లో తమకినచ్చిన దగ్గర యే రోజుకారోజు, యెప్పటికప్పుడు నిరంతరం సరిక్రొత్త కథలు కోసుకొని, వ్రాసుకొని సినీమాలు తీసుకొని, వార్తలు చెప్పుకొని అమ్ముకుంటూ సేద తీరుతున్న వినోద సాధనాలు.... సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించలేని, కాలక్షేపాన్ని మాత్రమే పండించే స్వయం ఉపాధి మార్గాల్లోని.... కళా కేంద్రాలు. అందుకే డబ్బు యొక్క మారకరూపంలో, దాని విచ్చలవిడితనంలో ఆకాశమంత కథా వస్తువుగా మారిపోయిన అవినీతి మహావృక్షాన్ని నేలకూల్చి, దేశ వంటయింటి చెఱకుగా మార్చి, ఇంధనంగా మండించి, భారతదేశాన్ని వెలిగించాలంటే.... డబ్బుకి కళ్ళు తెరిపించాలి. అది తనని ముట్టుకున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనాయకులు, ఐయ్యేయస్లు, ఐపీయస్లు, పోలీసులు, దొంగలు, దోపిడీదారుల్లో యెవ్వరైనా తనని యెలా పట్టుకున్నారో, యెంతమేర ముట్టుకున్నారో, యెక్కడెక్కడ వుంచుకున్నారో, యెలా దాచుకున్నారో, యెలా దుర్వీనియోగం చేసుకుంటూపోతున్నారో, అన్నీ వివరంగా పట్టుమచ్చలతో సహా ప్రతిఒక్కరి హస్తరేఖలు చెప్పగలిగేలా అన్ని భాషల్లోనూ.... డబ్బుకి మాటలు నేర్పించాలి. అందుకు కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రిణి శ్రీమతి ఇందిరాగాంధి.... 20 ప్రైవేట్ బ్యాంక్ ల జాతీయకరణ సిద్ధాంతంతో, భారతరాజ్యాంగధర్మాల్లో డబ్బుకి మెరుగులు పెట్టాలి. ఆ మెరుగుల్లోంచే మరింత మెరుగైన పారదర్శకమైన అవినీతికి అవకాశంలేని.... రాని కరేన్సీ & బ్యాంకింగ్ వ్యవస్థని భారతరాజ్యాంగ ధర్మ శిలాశాసనంగా.... భారతీయ యువజనులు, భారత రాజ్యాంగ నిర్మాతలు.... ప్రధాతల్లా, ప్రచార ప్రసార సాధనాల సమన్వయంతో సాధించాలన్నదే ఈ నవల ప్రధాన ఆశయం. లేకపోతే ఆకాశమంత కథా వస్తువుగా మారిపోయిన అవినీతి మహావృక్షం విశాలమైన పట్టుకొమ్మల పడగ నీడలో మేజార్టీ భారతీయుల ఆవాసాలు, ఆకలి కేకలు, ఆత్మాహత్యలు, అరాచకాలతో భారతదేశం యెలా కాలిపోతున్నదో మీకు తెలిసిందే మరింత వివరంగా విశ్లేషణాత్మకంగా.... దయచేసి చదవండి.