
SOUGANDHIKALU LALITHA GEETHALU
₹30
In stock · 32 available
PublisherDR.SAPPA DURGA PRASAD
LanguageTelugu
మున్నుడి డా॥ సప్పా దుర్గాప్రసాద్ సమీక్షకారి! అనగా ఏ పనినైనా చక్కగా యోచించి చేయగల నేర్పరి. ఆతని కృతి "సౌగంధికాలు” (లలితగీతాలు) కి మున్నుడి వ్రాయడం అదృష్టం. నాట్యకళారంగంలో జగత్ ప్రసిద్ధి చెందిన కళాకారునిగా స్థిరపడిన సప్పా కథలు, వ్యాసాలు, నవలలు, నాట్య శాస్త్రగ్రంథాలు వెలువరించి బహుగ్రంథకర్తగా బలపడిన ధీమంతుడు. కవిగా తన "హృదయా"న్ని ఎప్పుడో రసజ్ఞుల ముందు పరచుకొన్న సాహితీ పారంగతుడు. “సౌగంధికాల"ను మనసారా ఆస్వాదించాడు. "మల్లెమొగ్గల” కవితా సౌరభం "వెండివెన్నెల" తలపుకొచ్చింది "వెండి వెన్నెల గుండెలో/మధురభావాలను పండిస్తోంది/ చెలి రూపానికి ప్రతీకగా / నిలిచి ప్రకాశిస్తోంది". సౌగంధికములు అంటే చెంగలువలు, ఎర్రకలువలు ఆ రకంగా చూస్తే చిన్నికృష్ణునికై అల్లి గ్రుచ్చిన చెంగల్వ పూదండ ఈ గీతమాలిక! లలితగీతాలంటే మనోజ్ఞమైన పాటలని అర్థం. ఈ గీత మాలికలోని గీతాల క్రమాన్ని ఒకసారి పరికించి చూస్తే చక్కని ప్రణాళిక ద్యోతకమవుతుంది. ముందుగా "శ్రీగణనాథం” వినబడుతుంది. ఇందులోని విలక్షణం - సంగీత కచేరీలు మధ్యమావతి రాగంతో ముగుస్తూంటాయి. ఇక్కడ మధ్యామావతిరాగంతో ఆరంభం. తొలి చరణంలో "తొండపు దేవర” అన్న పదప్రయోగం మనోజ్ఞంగా ఉంది. "వక్రతుండాయ మహాకాయ" గుర్తుకొస్తుంది.