SOUNDARYAANVESHI BUCCHIBABU JEEVITHA SAHITYAM by DR.VEDAGIRI RAMBABU Telugu book cover

SOUNDARYAANVESHI BUCCHIBABU JEEVITHA SAHITYAM

by DR.VEDAGIRI RAMBABU

₹50
In stock · 20 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
బుచ్చిబాబు 'అంతరంగ కథనం' ఇది దాదాపు నూటొక్క సంవత్సరాల నాటి మాట. ఏలూరులో జరిగింది- 1916, 5,14- ఓ బిడ్డడుకి జన్మనిచ్చింది ఓ తల్లి! బిడ్డడుకో, బిడ్డకో ఓ వివాహిత జన్మనివ్వడం మామూలు విషయమేగా అంటారా? ఈ మామూలు విషయంలో కూడా కొంత అసాధారణత ఉంది! పిల్లవాడు జన్మించగానే తల్లి తీవ్ర అస్వస్థతకి గురైంది. అందరూ ఆ బిడ్డడు తల్లి గండాన పుట్టాడన్నారు. వాడు చనిపోతేతప్ప తల్లి తిప్పుకోలేదన్నారు. ఆ పసిగుడ్డుని ఓ మూల పడేశారు. ఎవ్వరూ ఆ బిడ్డడి గురించి కనుక్కునేవారు కారు. శరీరం పైన ఏర్పడ్డ పొక్కులను, చర్మాన్ని ఆ పసికందు పీకేశాడట, అవంటే గిట్టక కాబోలు! రక్తం కారేది. పాతగుడ్డపై పడుకుని మూలగా దొర్లుతూ ఏడుస్తూ గడిపేవాడు. కానీ, అప్పుడు అందరూ ఆశించినట్లు ఆ పసికందు మరణించలేదు! ఆ అమ్మకి మళ్ళీ సంతానం కలగకపోయినా మరో ఇరవై నాలుగేళ్ళు జీవించింది! ఆ పసివాడు మరెవరో కాదు- ప్రముఖ రచయిత, చిత్రకారుడు బుచ్చిబాబు. ఈ విషయాన్ని తన అంతరంగ కథనాన్ని ప్రారంభిస్తూ చెబుతారు బుచ్చిబాబు. అలా చెప్పడంలో ఉద్దేశం నాటి మూఢనమ్మకాల్ని ఖండించడం కూడా! ఇప్పుడాయన శతజయంతి పూర్తవుతోంది. కానీ ఆయన బ్రతికింది అర్ధశతాబ్దే! ఈ అర్ధశతాబ్దంలోనే అయన బాల్యం, చదువు, ఉద్యోగం, స్థిరపడటం, వివాహం, సాహిత్య జీవితం-కొనసాగాయి. ఈ రేఖాజీవిత చిత్రణ - కొండని అద్దఁ చూపించే ప్రయత్నం కాదు పలుశిఖరాలున్న పర్వతాన్ని చిన్ని అద్దంలో చూపించే ప్రయత్నం మాత్రమే! జీవితచరిత్ర రాయాలంటే రచయితకెంతో నిజాయితీ కావాలి. నిజాల్ని నిజాలుగానే, అబద్ధాల్ని అబద్ధాలుగానే చెప్పగల గుండె నిబ్బరం కావాలి. బుచ్చిబాబు చ్చిబాబు' డా॥ వేదగిరి రాంబాబు