SPOORTHY PRADATALU by RAAMAA CHANDRAMOULI Telugu book cover

SPOORTHY PRADATALU

by RAAMAA CHANDRAMOULI

₹100
In stock · 12 available
PublisherJ.V.PUBLICATIONS
LanguageTelugu
ఈ పుస్తకం గురించి., అసలు విజేత అంటే ఎవరు విజయం అంటే ఏమిటి. విజయం సాధించడము కేవలం డబ్బు సంపాదించడమేనా.. ఒకవేళ అది పాక్షిక సత్యమే అనుకుంటే జి ఎంత డబ్బు సంపాదిస్తే సంతృప్తమౌతాడు... అనంతానంత స్థాయిలో సంపాడా ప్రపంచ ధనవంతునిగా ఎదిగిన తర్వాత... తర్వాత ఏమిటి.? ఈ డబ్బు లేక సం సంపాదనకంటే పరమమైన సాధన ఏదైనా ఉందా. ఉంటే అది ఏమిటి.. ఆ స్థితి మనిషి తనను తాను తవ్వుకుంటూ, ఇసుకనేలను తవ్వితే చెలిమె బయటపడ్డట్టు వ తనను తాను ఆత్మాన్వేషణలో వియుక్తపర్చుకుంటూ విముక్తత గురించి ఆలోచించడా ప్రారంభించిన తర్వాత.. చుట్టూ అప్పటిదాకా కనిపించిన తన జీవితం, తనకు తెలిసిపో ఇతరుల జీవితాలు కొంగ్రత్త రూపురేఖలతో దర్శనమౌతూ.. అదే పాత సూర్యుడు కొత్తగా కనబడి, అదే పాత భూమి కొత్తగా తెలిసి.. అదే పాత గాలి, అదే పాత చెట్టు, అదే పాతు నీరు.. అన్నీ కొత్తగా, వింతగా, వినూత్నంగా పరిచయమౌతున్నవేళ.. మనిషి మహెూద్విగ్నుడై విచలితుడైపోతాడు. ఒక ఎడతెగని మధన, అధ్యయనం. లక్ష్యాన్వేషణ, నిర్వచన పునర్నిర్వచన మీమాంస, రీ-సర్చ్, శోధన, పరిశోధన.. మొదలౌతుంది. మనిషి మహెూద్విగ్నుడై విచలితుడైపోతాడు. ఒక ఎడతెగని మధన, అధ్యయనం, లభ్యాన్వేషణ, నిర్వచన పునర్నిర్వచన మీమాంస, రీ-సర్చ్, శోధన, పరిశోదన.. మొదలౌతుంది. మనిషి అంతర్ముఖుడై ముందు తనను తాను, తర్వాత ప్రపంచాన్ని 'తెలుసుకోవడం' ప్రారంభిస్తాడు. ఆ స్థితి అప్పటిదాకా మూసి ఉన్న కొత్త తలుపులను తెరుస్తుంది. కొత్త లోకాన్ని చూపిస్తుంది. కొత్త జీవితంలోకి నడిపిస్తుంది. అప్పుడు.. నిజమైన విజయం అంటే ఏమిటి.. ఎవరు నిజమైన విజేత, మనం నడుపవలసిన దారి ఏమిటి..? గమ్యం ఏమిటి.. ఏది అంతిమం, ఏది పరమం, ఏది శాశ్వతం.. ఏది అశాశ్వతం అని తెలియజేస్తూ మనిషికి ఏది అవసరమో అనేదాని కంటే ఏది అవసరంలేదో తెలియపరుస్తుంది. ఇది 'స్పృహ..' 'ఎరుక'. ఆ 'ఎరుకను కలిగించే ప్రయత్నాన్ని ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళి ఈ 'స్పూర్తి ప్రదాతలు' పుస్తకంలో సశాస్త్రీయంగా, విశ్లేషణాత్మకంగా, చక్కని అన్వయింపుతో, ప్రత్యేకమైన కవిత్వ భాషలో చెప్పారు. ప్రపంచ ధనవంతుడైన 'వారెన్ బఫెట్' తన ఆస్తిలో 99 శాతంను ఎందుకు దానం చేశాడు, ప్రపంచ కంప్యూటర్ వ్యవస్థను శాసించే బిల్ గేట్స్ ఆయన భార్య మిలిండాగేట్స్ తమ సకల సంపదలను కూర్చి 'బిల్ మిలిండా ఫౌండేషన్'ను ఎందుకు స్థాపించాడు, భారతదేశంలో విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ భారత కార్పొరేట్ దిగ్గజాలందరికంటే ప్రథమ స్థాయిలో రూ. 8846 కోట్లను ఎందుకు ఈ సమాజ ఉద్ధరణకోసం దానం