
SRAMANAKAM
by DR.NANDAMURI LAKSHMI PARVATHI
₹150
In stock · 17 available
PublisherS.R PUBLICATIONS
LanguageTelugu
ISBN9788194879381
ముందుమాట 'శ్రమణకం' ఒక పుస్తకంగా రూపుదిద్దుకుని వెలువడడానికి వెనుక దీనికి తొలిబీజం పడ్డ కాలపరిస్థితుల గురించి కొద్దిగా ముచ్చటించవలసి ఉంది. నేను 1975లో భాషాప్రవీణ చదివేటప్పుడు 'పింగళి కాటూరి వారి 'సౌందర నందనం' కావ్యం చదివాను. అందులో సుందరి పాత్ర ఒక గొప్ప ప్రేమికురాలిగా, భర్తను విడిచి క్షణమాత్రమైన నిలువలేని ఆరాధకురాలిగా కనిపిస్తుంది. తను కూడా భర్త మార్గాన్ననుసరించి చివరకు బుద్ధుని అనుగ్రహంతో నందుడిని కలుసుకుంటుంది. అంతవరకే కథ. ఆ పాత్రలో తరతరాల స్త్రీ సహజమైన మార్దవాన్ని, ప్రణయ భావుకతను మాత్రమే చూస్తాం. దాని పూర్వాపరాల గురించి చర్చలేదు. ఆ కావ్యం తెలుగు సాహిత్య ప్రపంచంలో రసజ్ఞుల నోలలాడించింది. అందుకే 1989లో ఎమ్. ఫిల్. లో తులనాత్మక అధ్యయనం క్రింద తెలుగులో 'సౌందరనందం', హిందీలో 'లహరోంకె రాజహంస', సంస్కృతంలో అశ్వఘోషుని 'సౌందరనందం' పరిశీలనకు తీసుకోవటం జరిగింది. సుప్రసిద్ధ హిందీ నాటక కర్త మోహన్ రాకేష్రి హిందీ నాటకం చదివాక సుందరి పాత్ర అద్భుతమైన వ్యక్తిత్వంతో నా కళ్ళముందు సాక్షాత్కరించింది. ఆయన పదమూడు పర్యాయాలు ఆ నాటకాన్ని తిరగరాసి, ఆ పాత్రకు అద్భుతమైన మెరుపులు దిద్దారు. ఫలితంగా తెలుగులో లీలా మాత్రంగా కనపడే ఈ పాత్ర హిందీలో మోహన్ రాకేష్ గారి సృష్టిలో పరిపూర్ణతను సంతరించుకుని పాఠకుల మనసులో ఒక ప్రముఖ స్థానాన్నాక్రమిస్తుంది. అది చదివి ఆ పాత్రను అర్థం చేసుకున్నాక సుందరి మీద నా ప్రేమ, ఆరాధన పదింతలు పెరిగాయి. హిందీ నాటకాన్ని తెలుగులో అనువాదం చేసుకుని ఆ పాత్రను మరింత శోధించేదాకా నిద్రపట్టలేదు.