
SRAMANAKAM - 75
by DR.NANDAMURI LAKSHMI PARVATHI
₹75
In stock · 15 available
PublisherDR.N.T.R EDUCATIONAL SOCIETY
LanguageTelugu
'శ్రమణకం' ఒక పుస్తకంగా రూపుదిద్దుకొని వెలువడడానికి వెనుక దీనికి తొలిబీజం పడ్డ కాల పరిస్థితుల గురించి కొద్దిగా ముచ్చటించవలసి ఉంది. నేను 1975లో భాషాప్రవీణ చదివేటప్పుడే 'పింగళి కాటూరి' వారి 'సౌందరనందం' కావ్యం చదివాను. అందులో సుందరి పాత్ర ఒక గొప్ప ప్రేమికురాలిగా, భర్తను విడిచి క్షణ మాత్రమైన నిలువలేని ఆరాధకురాలిగా కనిపిస్తుంది. తను కూడా భర్త మార్గాన్ననుసరించి చివరకు బుద్ధుని అనుగ్రహంతో నందుడిని కలుసుకుంటుంది. అంతవరకే కథ! ఆ పాత్రలో తరతరాల స్త్రీ సహజమైన మార్దవాన్ని, ప్రణయ భావుకతను మాత్రమే చూస్తాం. దాని పూర్వాపరాల గురించి చర్చ లేదు. ఆ కావ్యం తెలుగు సాహిత్య ప్రపంచంలో రసజ్ఞుల శ్రీలలాడించింది. అందుకే 1989లో ఎమ్.ఫిల్. లో తులనాత్మక అధ్యయనం క్రింద తెలుగులో 'సౌందర ముదం', హిందీలో 'లహరోంకె రాజహంస', సంస్కృతంలో అశ్వఘోషుని 'సౌందరనందం' పదిశీలనకు తీసుకోవటం జరిగింది. సుప్రసిద్ధ హిందీ నాటకకర్త మోహన్ రాకేష్ గారి హిందీ నాటకం చదివాక సుందరి పాత్ర అద్భుతమైన వ్యక్తిత్వంతో నా కళ్ళముందు సాక్షాత్కరించింది. ఆయన పదమూడు పర్యాయాలు ఆ నాటకాన్ని తిరగరాసి, ఆ పాత్రకు అద్భుతమైన మెరుపులు నవాడు. ఫలితంగా తెలుగులో లీలామాత్రంగా కనపడే ఈ పాత్ర హిందీలో మోహన్ రాకేష్ ట సృష్టిలో పరిపూర్ణతను సంతరించుకుని పాఠకులు మనసులో ఒక ప్రముఖ స్థానాన్నా కమిస్తుంది. అది చదివి ఆ పాత్రను అర్థం చేసుకున్నాక సుందరి మీద నా ప్రేమ, ఆరాధన సమతలు పెరిగాయి.