SREE RAMANUJA CHARITHAMRUTHAM by DR.DASARADHI RANGACHARYA Telugu book cover

SREE RAMANUJA CHARITHAMRUTHAM

by DR.DASARADHI RANGACHARYA

₹120
In stock · 4 available
PublisherDR.DASARADHI RANGACHARYA
LanguageTelugu
శ్రీ రామానుజ చరితామృతమ్ యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ వ్యామోహత స్తదితరాణి తృణాయమేనే అస్మద్గురో ర్భగవతోస్య దయైకసినోః రామానుజన్య చరజౌ శరణం ప్రపద్యే ॥ పూర్వ సంధ్య ఆ విధంగా శ్రీమానుజులనుతించి కృత్యాది - కల్యాది 5105 వ్యయనామ సంవత్సర మార్గశీర్ష శుక్ల ద్వాదశి 2.12.2006 శనివారం ఉదయం 9.00 గంటలు. నివాస అభారతీయులం ప్రస్తుతం మనం మాయా జాలంలో ఉన్నాం. మనకు మనం తెలియని మాదక దశలో జీవిస్తున్నాం. మనదేశంలో విదేశీయులం అయినాం. మన వేషభాషలను దులిపేస్తున్నాం. భారత ప్రదేశాన్ని దర్శింపలేని దివాంధులం అయినాం. మన మహోన్నత నాగరికత- సంస్కృతి సంప్రదాయాలు- సాహిత్యం- శిల్పం-కళలు- తాత్వికత కోసం త్రవ్వుకోవలసిన నికృష్ణ స్థితికి చేరుకున్నాం. స్వధర్మమును వదిలాం. భయంకరం అయిన పరధర్మపు మరీచికల వెంట పరుగులు తీస్తున్నామని తెలియకున్నాం. ఇది కేవలం స్వయంకృత అపరాధం, ఆత్మహత్య వంటిది. మనకు అమెరికాను గురించి మరింత తెలుసు- భరత భూమిని గురించి ఏమీ తెలియదు ఇది తెలిసీ తెలియకపోవడమే ఇందుకు కారణం బానిసత్వం అవిద్యాప్రచారం స్వాతంత్య్రం అనేది వచ్చి తరువాత సాంస్కృతిక బానిసత్వం వదిలించుకున్నాం. రాజకీయ బానిసత్వం కన్న సాంస్కృతిక బానిసత్వం నీచం, నికృష్టం, హేయం. ఈమధ్య మరొక వింత స్థితి ఏర్పడింది. యువత తెలుసుకోవాలం టున్నారు. వారికి అర్థమయ్యే రీతి రచించేవారు అరుదు అవుతున్నారు. సాధారణుల కోసం సులభ సుందర వచనం వ్రాయడం నా తపస్సు. ఇంతవరకు నాలుగు వేదాలు, రెండు బ్రాహ్మణములు- పది ఉపనిషత్తులు- రెండు రామాయణాలు-భారత భాగవతాలు 12 సంపుటాల ఆధునిక సాహిత్యం మొత్తం 61 గ్రంథాలు-1577 అచ్చుపుటలు వెలువరించాను. తెలుగువారు తరాలుకు అతీతంగా సుమారు అర్థశతాబ్దం నుంచి నా రచనల్ని శ్రీ రామానుజ చరితామృతమ్ డా॥ దాశరథి రంగాచార్య