
SRI DHANVANTARI
₹60
In stock · 34 available
PublisherDR.PEKETI GEETASIVARAM
LanguageTelugu
భగవంతుని అవతారాలు ఆధ్యాత్మిక పౌరాణిక గ్రంథాలు నిత్య నూతనంగా ఉంటాయి. మళ్ళీమళ్ళీ చదివినా మొదటిసారి చదువుతున్నామనే భావన వస్తుంది. కానీ, తిరిగి చదువుతున్నామనే భావన రానేరాదు. ఇదే మన సంస్కృతి గ్రంథాలు రచించిన మహా పురుషుల గొప్పదనం. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఆదినారాయణుడు దేవతల కోరిక మేరకు శాపకారణ కర్మఫలం అనుభవించడానికి అవతారాలు ఎత్తాడు. అందులో ముఖ్యంగా మనం దశావతారాలుగా చెప్పుకుంటుంటాం. భగవానుని 21 అవతారాల్లో 12వ అవతారమైన శ్రీ ధన్వంతరీ భగవాన్ అవతారంగా ప్రమాణ గ్రంథాలు చెప్తున్నాయి. భగవంతుని అవతారాలను మూడు తరగతులుగా విభజిస్తే (1) పూర్ణావతారం (2) ఆవేశావతారం (3) అంశావతారంగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువులోని కొంతభాగము స్వయం భూ అవతారాలుగా చెప్పవచ్చును. అందులో భగవాన్ ధన్వంతరీ స్వయంభూ అవతారం. అనారోగ్యం ప్రబలినపుడు ఆరోగ్యామృతంగా ఆయుర్వేదాన్ని అందించిన భగవానుడుగా క్షీరసాగర మదనంలో ఆవిష్కరించిన మహాఆరోగ్య దేవుడు భగవాన్ శ్రీ ధన్వంతరీ. శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తడానికి రెండు శాపకారణాలు. ఒకటి భృగుమహర్షి విష్ణువునకు ఇచ్చిన శాపం, రెండవది విష్ణు ద్వారపాలకులు జయవిజయులు, సనకసందనాది మునుల వలన పొందిన శాపం రెండవది. ఈ అవతారాలన్నింటిలోనూ జయవిజయులు లేకపోయినా దుష్టశిక్షణకే కదా! వామనావతారం తర్వాత రాక్షసులు రాజ్యభ్రష్టులై శుక్రాచార్యుని ఆశ్రయించగా. నాకు విష్ణువుకు ఉన్నంత మంత్రబలం లేదు. కావున నేను శివుని ప్రార్ధించి, తపస్సు చేసి, ఆశక్తిని సంపాదిస్తాను. అప్పటివరకూ సాధువుల్లా జీవించండి అని వెయ్యేళ్ళ పాటు తపస్సుకు ఉపక్రమించారు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసి తామ స వేషాల్లోని రాక్షసుల మీద దండయాత్ర సాగించగా సంగతి బైటపడింది. దారి తెలియక శుక్రాచార్యుని తల్లియైన భృగుపత్నిని ఆశ్రయించారు. దేవతలు వాళ్ళ ఆశ్రమంలో చొరబడి మరీ రాక్షసహింస ప్రారంభించారు. భృగుపత్ని, దేవతల మీద నిద్రాదేవిని ప్రయోగించగా దేవతలతోపాటు ఇంద్రునికి కూడా కునికిపాట్లు రాగా అప్పుడు విష్ణువు ఇంద్రునితో తన శరీరంలో దాక్కోమన్నాడు. ఇంద్రుడు అలాగే చేశాడు. అది గుర్తించిన గురుపత్ని క్రోధంతో “నిన్నూ నీ విష్ణువును నాశనము చేస్తాను అని తన యోగశక్తిని ప్రయోగించగా ఇంద్రుడు భయపడి, విష్ణుదేవా ! ఈమెకు యోగవిద్యా ప్రభావం ఎక్కువగా ఉంది.