SRI GANESHA by GOLLAPUDI VEERASWAMY SON Telugu book cover

SRI GANESHA

by GOLLAPUDI VEERASWAMY SON

₹99
In stock · 1 available
PublisherGOLLAPUDI VEERASWAMY SON
LanguageTelugu
ముందుమాట ఆబాలగోపాలానికి - ఆత్మీయులైన దేవతలు యిద్దరు. ఒకరు శ్రీ గణేశ- మరొకరు శ్రీ ఆంజనేయస్వామి. మన యింట్లో మనసులో యే కార్యాన్ని తలపెట్టినా ముందుగా గణపతిని తలచుకోకుండా వుండము. ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య అని ఆత్మీయతా భావంతో - ఆత్మార్పణం చేసుకొని పూజిస్తాము. అలాంటి శ్రీ గణేశునిపై ఒక గ్రంథాన్ని ప్రచురించాలని అనుకొన్నాము. కాని అది -అనుకొన్నంత సులువు కాదని ఆరంభించిన తరువాత క్రమక్రమంగా అర్థమయింది. అనంతమయిన - విశ్వవ్యాప్తమైన శ్రీ గణేశుని మహిమ మా మాటలకి మనస్సలకి అందదని స్పష్టమయింది. అయినా ఆయన అనుగ్రహంచేత యధాశక్తిగా ప్రయత్నించాము. ఒకోచోట ఆటంకం కలిగినప్పుడల్లా - శ్రీగణేశుని కృపవలన- ఒకో విషయం స్ఫురించింది. దానిని యధాశక్తి అక్షరాలలో కూర్పు చేశాము. అది యెలా వుందో అని సంకోచపడే మాకు శ్రీ గణేశుడుకు - మీ అభిమానం ఆదరణ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సహిస్తాడని మా ఆశ. విజ్ఞులయిన అభిమానులు యిచ్చిన సూచనలతో మరింత ముందుకు రాగలము. ఈ గ్రంథాన్ని భక్తిశ్రద్ధలతో ఆదరాభిమానములతో యిలా కూర్చి యిచ్చిన కూర్పరులకు మా కృతజ్ఞతలు. దశాబ్దాల తరబడి మా ప్రచురణలని ఆదరిస్తున్న మీకు మీ అభిమానాన్ని పొందిన మాకు - శ్రీ గణేశుడు యెడతెగని బలమైన ఆత్మీయతని అనుబంధాన్ని పెంపొందించాలని ఆశిస్తున్నాము. ఇక - ఈ గ్రంథంలో ఏమేమి వున్నాయన్నది మేం చెప్పేకంటే ఏమేమి లేవో మీరే చెప్పాల్సి వుంటుంది. ఇది పెద్ద పర్వతాన్ని చిన్న అద్దంలో చూపే ప్రయత్నం. అయినప్పటికీ ఎనిమిది భాగాలుగా గ్రంథాన్ని విభజించి, ఆయా విభాగాలకు సంబంధించిన ప్రత్యేకత గల విషయాలను ఈ గ్రంథంలో చేర్చడానికి కృషి చేశాం! అరుదైనవీ అతిమహిమాన్వితమైనవీ అయిన మంత్రాలను దీనిలో చేర్చాం! ఇతరత్రా ప్రస్తుతం లభ్యమవుతున్న గ్రంథాలకు మా గ్రంథానికీ గల తారతమ్యం తెలిసి, దీనిని ఆదరించగలరని విశ్వశిస్తున్నాం.