SRI KRISHNADEVARAYALU PATTABHISHEKA PANCHA SHATABDI SANDARBHAM by RAVINUTALA SRI RAMULU Telugu book cover

SRI KRISHNADEVARAYALU PATTABHISHEKA PANCHA SHATABDI SANDARBHAM

by RAVINUTALA SRI RAMULU

₹20
In stock · 115 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గొప్పతనం ఎలా కలుగుతుంది? “ఈ భూమండలాన్ని ఏలిన వేలాది రాజులు చక్రవర్తులలో అశోకుని పేరు మహోజ్జ్వలతారగా వెలుగొందుతున్నది" అన్నారు ప్రపంచ చరిత్రకారులు హెచ్.జి వెల్సు. అశోకునికీ గొప్పతనం ఎలా కలిగింది? ప్రజారంజకంగా పాలన సాగిస్తూ శాశ్వతమైన నిర్మాణాలు చేయడం మూలాన్నే. ఆంధ్రమహాకవి పోతన కూడా త్యాగబుద్ధిగలపాలకులనే ప్రజానీకం గుర్తుంచుకుంటారంటూ కారే రాజులు! రాజ్యముల్ కలుగవే వారేరీ సిరి మూటగట్టుకుని పోవం జాలరే భూమిపై పేరైనం గలదే అని భాగవతంలో వ్రాశాడు. ప్రపంచాన్ని జయించడానికి పూనుకొన్న అలెగ్జాండరు కూడా మరణ సమయంలో తన రెండు చేతులు చాచి "నేనేమీ తీసుకొని పోవడం లేదంటూ" ప్రజలకు తెలియజేశాడు. కాలగర్భంలో కలసిపోయిం తర్వాత కూడా ఎవరి కీర్తి నిలిచివుంటుందో వారు చిరస్మరణీయులు. అయిదువందల ఏండ్లనాడు సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలను దేశమంతటా నేడు స్మరించుకుంటున్నది అంటే వారి కార్యక్రమాలన్నీ ఆదర్శప్రాయం కావడం మూలంగానేనని గ్రహించాలి. ఉత్తరదేశంలో భోజరాజు పాలించిన కాలంలో మహాకవి కాళిదాసు మొదలయిన నవరత్నాలు ఆయన రాజ్యంలో కొలు వుండేవారు. రాజధాని ధారానగరంలో కవులు కాని వారెవరు వుండేవారు కారు. ఒక చిత్రమైన గాథ మిక్కిలి ఆసక్తిదాయకం.