SRI MAHABHAGAVATAMU - 1 TO 3 PARTS by NAVARATNA BOOK HOUSE Telugu book cover

SRI MAHABHAGAVATAMU - 1 TO 3 PARTS

by NAVARATNA BOOK HOUSE

₹900
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ము న్ను డి భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను చెప్పినది భాగవతం. భక్తికీ, ముక్తికీ జీవాతువు భాగవతం. ఇంతెందుకు? ఉభయతారకం భాగవతం. పద్దెనిమిది పర్వాల మహాభారతం “పంచమవేద" మనిపించుకున్న మహా గ్రంథాన్ని చెప్పిన మహాకవి మనశ్శాంతి లేక సరస్వతీనదీ తీరాన కూర్చుని దిక్కుదోచని “ముడులాగ దిక్కులు చూస్తూ ఉంటే నారదుడు వచ్చి బోధించాడు. ఆ బోధఫలమే ఆనరనారాయణునిచే భాగవత రచన చేయించి, భాగవత రూపాన జీవలోకానికి అన్ని విధాలా శాంతిదేవత అయింది. అలాటి 'భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన' అని అన్నాడు పోతనామాత్యుడు. రెండవపాదాన్ని నేను "ధాతకైన వాని శాతకైన" అని ఒక సభలో చదవగా, "అదేమిటండీ! అది పాఠాంతరమా" అని ఒకరడిగారు. "పాఠాంతరమ్మాట కేమి? అది తప్పా?" అన్నాను నేను. “ఏమిటో పెడసరంగా ఉంది" అన్నా రాయన. “పెడసరం కాదు సరసమే, ధాత= బ్రహ్మ, వాని శాత = నారాయణుడు. భాగవతం తెలిసి చెప్పడం నారాయణునకూ సాధ్యంకాదు. ఎందుకంటారా, భక్తునికంటె తన ప్రభావం తక్కువగా ఉంటుందని ఆయన అన్నాడు. కావాలంటే అంబరీషుని కథ చదివి అర్థంచేసుకోండి" అన్నాను. ఆయన ప్రత్యాఖ్యానం చెయ్యలేదు. అలాగే అయిదేళ్ళు ప్రహ్లాదుడు అరవైయేళ్ళ తండ్రికి దైవస్థితి చెప్తూ, “ఎందెందు వెదకి చూచిన అందందే కలడు" అని అన్నాడు. వెదకి చూడడానికి దైవం నల్లపూసా! ఏమిటా వెదకడం? ఆత్మదర్శన నిష్ఠ గలవాడై దహరాకాశములో ఉన్న ఆత్మస్వరూపుణ్ణి దర్శించడానికి సర్వాత్మనా పరిశ్రమించడం. వెదకి” అనే తెలుగు అసమాపక క్రియలో అంత ఆధ్యాత్మిక బోధ చేశాడు ప్రాచీన గురువు. అలాగే కపిల - దేవహూతి సంవాదం జీవరహస్యాన్ని తెలుపుతుంది. గజేంద్రమోక్ష కథ పారాయణ యోగ్యం అని యీనాడెవ్వరూ సర్టిఫికెట్టు ఇవ్వనక్కర లేదు. అహంకార నిరాసక్రియకి అది పరాకాష్ఠ. వామనావతార ఘట్టం శీలపోషక దివ్యబోధ. "మాట తిరుగలేరు మానధనులు" అని బలిచే పలికించడం విమర్శించి తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవాలి. "పగ, పగ” - యీ రెండు గుణాలలో దేనిచేనైనా దేవుణ్ణి సాధించవచ్చునని పాతనామాత్యుని తీర్పు.