SRI MAHABHARATHAMU 1 TO 7 PARTS by NAVARATNA BOOK HOUSE Telugu book cover

SRI MAHABHARATHAMU 1 TO 7 PARTS

by NAVARATNA BOOK HOUSE

₹3,000
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
పరిచయము భారతము పంచమ వేదము. ఈ గ్రంథమునకు 'జయ' మని పేరు. అనగా మానవునకు ధర్మార్థ కామ మోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి యీ గ్రంథము పఠించువారికి యిందలి రహస్యములు పరిచయములగును. భారతము నందలి పర్వములు 18. భారత సంగ్రామము 18 దినములు జరిగినది. అందు 18 అక్షౌహిణుల సేన పాల్గొనినది. మహాభారత మందలి గీతా సందేశము 18 అధ్యాయములు. అందు పాల్గొనిన మహావీరులు 18 మంది. ఈ విధముగ 18 (3×6) సంఖ్యకు ప్రాధాన్య మివ్వబడినది. అదే విధమున రామాయణము 6 (1x6) కాండలలోను, భాగవతము 12 (2×6) స్కంధములలోను వివరింపబడినది. కపిలుని సంఖ్యా శాస్త్రమున 3, 6, 9 అంకెలు వృత్తాకారముగ సాగు సృష్టి ధర్మములను తెలుపు సాధనములుగా తెల్పబడినవి. సృష్టి స్వరూపమైన గాయత్రీ మాతను వేదఋషులు 24 (4×6) వర్ణములుగా (లేక అక్ష+రములు, అ+క్షరములు) దర్శించిరి. నాలుగు పాదములుగ (4×6) దర్శింపబడిన సృష్టి యందు దృగ్గోచరమగు భాగము ఒక పాదమని ఋగ్వేదమున నిర్ధారణము జరిగినది. (పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి) మిగిలిన మూడు పాదములు దివ్యములు, అమృతములు. అనగా నశించనివి. 24 వర్ణములు లేక అక్షరములలో ఈ విధానమున 18 వర్ణములు దివ్యములు. అమృతములు. 6 వర్ణములు మృతములు. అనగా మార్పు చెందునవి. (మరణ మనగా మార్పు అని కూడా భారతము ప్రతిపాదించుచున్నది) మార్పు చెందనివి, నశించనివి, శాశ్వతమైనవి యగు 18 సృష్టి ధర్మములను ప్రకటనము చేయుటకు చేసిన వ్యాసభగవానుని ప్రయత్నమే శ్రీ మహాభారతము. ఈ 18 రహస్యములును 'కృష్ణగీత' యందలి 18 అధ్యాయములలోను, మొత్తము గ్రంథమందలి 18 పర్వములలోను ప్రతిపాదింపబడినవి. శ్రద్ధ, భక్తి, అనసూయత్వము స్వభావముగాగల మానవునకు బుద్ధియోగమున యీ రహస్యములు దర్శనములు కాగలవు.