
SRI MAYAMATHA SHILPA SASTRAMU
by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA
₹300
In stock · 10 available
PublisherSTHAPATYAVEDA RESEARCH FOUNDATION
LanguageTelugu
ISBN9788199379893
మయమతం శిల్పవిభాగం మయుని వాస్తుశిల్పశాస్త్రములు అతి ప్రాచీనములు. ఇప్పుడు మనముందున్నది శిల్పశాస్త్రము, మయుని గ్రంథములు శిల్ప ప్రపంచమున మిక్కిలి ప్రాచుర్యం సంతరించుకున్నవి. మయుడు దాక్షిణాత్య వాస్తు శిల్ప ప్రపంచమునకు పితామహుడిగా ప్రసిద్ధి వహించి ఉన్నాడు. నామ రూపములు జగత్తునకు ఆధారభూతములు. రూపముననుసరించి నామము ప్రవర్ధిల్లును. నామమునకు ఆధారం రూపం. ఈ జగత్తు అంతా రూపములమయం. అయితే ఈ రూపములకు ఆది రూపమేది..? అని ప్రశ్నించిన వేదం "రూపం రూపం ప్రతిరూపం బభూవ" అని సమాధానమిచ్చింది. ఈ అనేక రూపములకు మూలమైన రూపం ఒకటుంది. అదే పరమాత్మ. దానినే వేదం 'విరాట్టు' అనిచెప్పింది. ఈ విరాట్టు నుండి బ్రహ్మలు - దేవతలు - ఋషులు - మనుషులు జన్మించారు. బ్రహ్మలు సృష్టిరచనా పరాయణులు. ఆ విద్యను దేవతలకు అందించగా వారు ఋషులకు అందించారు. వారు మానవుల కందించారు. ఇది సృష్టిరచనా పారంపర్యం. ఇదే శిల్పవిద్యా పారంపర్యము. బృహదారణ్యకోపనిషత్తులలో ఈ ఋషి పారంపర్య విస్తరణ సానగ-సనాతన-అహభూన- ప్రత్న- సుపర్ణులనే ఋషి పంచకంతో ప్రారంభమై విస్తరించిందని స్పష్టం చేయబడింది. శిల్పవిద్యకు ఆధారం రూపం. ఈ రూపకల్పనను వివిధ వస్తువుల ముఖముగా లోకమునకు అందించబడుతున్నది. మృత్తు-కాష్టము-ధాతువు-శిల-లోహముల మూలంగా మానవునికి చేరి అతని బహిక-ఆముష్మిక అవసరములు తీర్చుతున్నది. మృత్తిక, కాష్ట, పట, పత్రములపై సృష్టించినవి తాత్కాలికములు అవుతున్నాయి. అందువలన కాలముదాచే నిలువగలిగిన వస్తువులుగా శిల, ధాతు, లోహములు ఎన్నుకోబడ్డాయి. వీటిలో ప్రకృతిలో అతి చవకగా దొరికి శాశ్వతంగా మన్నగలిగిన శిలను ఆచార్యపురుషులు రూప నిర్మాణమునకు అనువైనదిగా నిర్ణయించి సృష్టి మొదలుకుని నేటివరకు గృహము, గోపురము, దేవళము, విగ్రహముల నిర్మాణాలకు వినియోగించారు.