SRI PARAKALA PATTABHI RAMARAO GARI - SATHA JAYANTHI SAMSMARANA SANCHIKA by PARAKALA SURYAMOHAN Telugu book cover

SRI PARAKALA PATTABHI RAMARAO GARI - SATHA JAYANTHI SAMSMARANA SANCHIKA

by PARAKALA SURYAMOHAN

₹100
In stock · 1 available
PublisherPARAKALA SURYAMOHAN
LanguageTelugu
ముందుమాట “మాకు తెలిసిన మా నాన్నగారు" మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనొక నిష్కళంక దేశభక్తుడు. నిఖార్ణయిన కమ్యూనిస్టు. నమ్మిన సిద్ధాంతాలకు చివరివరకూ కట్టుబడివున్న మహోన్నతమైన వ్యక్తి ఆయన. స్నేహశీలి, సహృదయులు, అజాతశతృవు అయిన మా నాన్నగారు పరకాల పట్టాభిరామారావు గారి జీవితం ఆద్యంతం ఉత్కంఠభరితం, ఎన్నో సాహసకృత్యాలు ఆయన జీవితంలో అడుగడుగునా తారసపడతాయి. ఆయన ఎంతో నిబద్ధతగలకమ్యూనిస్టుగా, అజ్ఞాతవాసంలో పోలీసుల కంటపడకుండా మారువేషాల్లో రహస్యంగా ఏఏ రాష్ట్రాలలో తిరిగినది మాకు చెబుతోంటే ఏదో థ్రిల్లర్ సినిమా కథలా నోరు వెళ్లబెట్టి వింటూవుండేవాళ్లం. తాను రహస్యంగా వుంటున్న డెన్ పరిసరాల్ని ఓ అరగంట వ్యవధిలో పోలీసులు జల్లెడ పట్టబోతున్నారన్న సమాచారం అందగానే ఎక్కడికీ పారిపోలేక, అక్కడున్న అతిపొడవాటి తాటిచెట్టు పైకంటా ఎక్కి, తాటిమట్టల గుబురులో ఒక రోజంగా వుండిపోయారు. అది ఎవరికీ ఊహకందని రహస్య ప్రదేశం. ఆ రాత్రి అంతా పోలీసుల బూట్ల చప్పుడు, టార్చిలైట్ల కాంతి, విజిళ్ల శబ్దాలతో ఆ ప్రదేశం మార్మోగిందట. రాత్రి తెల్లవార్లూ కంటిమీద కునుకు లేకుండా గడిపారట మా నాన్నగారు. అదొక నరాలు తెగే, ఒళ్లు జలదరించే ఉత్కంఠ భరిత సాహసకృత్యం. తాటిచెట్టు మీద తాటిమట్టల గుబురులో మా నాన్నగారు, క్రింద తాటిచెట్టును ఆనుకుని బీడీలు కాలుస్తూ నుంచినివున్న పోలీసులు వాళ్లలో ఎవరు చెట్టుమీదకు టార్చిలైట్ వేసినా లేక మా నాన్నగారు ఏమాత్రం చప్పుడు చేసినా ఏమైయ్యేదో, తలచుకుంటే గుండె ఆగిపోతుంది. సెర్చి పార్టీ వెళ్లిపోయిన తరువాత నెమ్మదిగా చెట్టుదిగి, ఆకలి బాధ తట్టుకోలేక సమీపంలో వున్న ఓ పూరిగుడిసెలోకి వెళ్లారట. అదొక చాకలివాళ్ల ఇల్లు.