SRI RAMANA - MANAVA SAMBANDHALU by SRI RAMANA Telugu book cover

SRI RAMANA - MANAVA SAMBANDHALU

by SRI RAMANA

₹375
In stock · 56 available
PublisherPRISM BOOKS PVT LTD
LanguageTelugu
ISBN9789386506177
బ్రహ్మాండం నించి అండం దాకా గుర్తొంకాయ్ కూర - మానవ సంబంధాలు అంటూ ప్రారంభించి కొన్ని రాయగానే, ఆరుద్ర “ఇహ మీకు దిగుల్లేదు ఓ గని దొరికింది తవ్వుకోండి” అని నవ్వుతూ దీవించారు. ఈ శీర్షిక అవధాన ప్రక్రియలో ఒక అంశంలా తయారైంది. కొందరు తాడిచెట్టు, రైలింజను లాంటి పేర్లు చెప్పి రాసెయ్యండి ఆశుకవిత్వం అనడం మొదలుపెట్టారు. ఇనపగుర్రం మీద, తాడిమీద రాయడం అస్సలు కష్టం అనిపించేది కాదు. తాడిచెట్టులా ఎదిగావ్ బుద్ధి లేదూ అనడం మామూలే. మరింకో చెట్టుతో పోల్చరు. తాటాకుతో మొదలుపెట్టి, భారతీయ వాఙ్మయంలో వెలువడిన మహాగ్రంథాలన్నీ తాళపత్రాలమీదే జనంలోకి వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు. కనక తాటాకులకెక్కలేదు. నాలిక గీసుకోడం నించి బొమ్మలు బూరలు చేసుకునే దాకా తాటాకు ఉపయోగం ఉంది. ఇంటికప్పుల నించి అదే. అంతేనా తలలో ఉన్న అమృతం గొప్ప నిషా. తాడిచెట్టుతో వచ్చేన్ని సామెతలు ఏ చెట్టులోనూ రావు. రైలెంత ఉపయోగమో అంత ప్రమాదం. కోపం వస్తే రైలు కింద తలకాయ పెడతానని అత్తలూ కోడళ్లూ కోపాలొచ్చినప్పుడు బెదిరించే వారు. ఆత్మహత్యలకి రైలు రాజమార్గంగా ఉండేది. పైగా పల్లె బస్తీ అని భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది. చావుకి సిద్ధపడ్డవాళ్లు నాలుగడుగులు వేస్తే రైలుపట్టాలు ఆశావహంగా కనిపించేవి. 'రాముడు - మానవ సంబంధాలు' మీద ప్రస్తావన వచ్చింది. దశావతారాల్లో సంపూర్ణ మానవత్వ మానవరూపం ఒక్క రామావతారానిదే. అవతార లక్షణంలో ఏమాత్రం కల్తీ జరిగినా రావణబ్రహ్మని జయించలేడు. ఏకపత్నీవ్రతం మనిషి ప్రాథమిక లక్షణంగా రామాయణం పేర్కొంది. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు రాముడికి నమ్మినబంటుగా చరించి ధన్యుడైనాడు. ఇక్కడో సంఘటన గుర్తొస్తోంది. అన్ని ఊళ్లలోలాగానే మా ఊళ్లో కూడా ఔత్సాహిక నాటక సమాజం ఉండేది.