SRI SHIRIDISAI AARADHANA by DR.PEKETI GEETHA SHIVARAM Telugu book cover

SRI SHIRIDISAI AARADHANA

by DR.PEKETI GEETHA SHIVARAM

₹100
In stock · 20 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
శ్రీ సాయి చరిత్ర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపమైన దత్తాత్రేయ అవతారమైన సాయి 1854వ సం||లో 14సం॥ల బాలునిగా “షిరిడి" లో అవతరించి, బాలునిగా ఉన్నప్పుడే కేవలము చేతిస్పర్శచే పుట్టు గ్రుడ్డువారికి చూపు, కుంటివానికి నడక, కుష్ఠురోగికి ఆరోగ్యము ప్రసాదించేవారు. సాయి నిప్పు సహాయము లేకుండా సంకల్ప మాత్రాన వెలిగించిన ధుని నేటి వరకు ఆరకుండా వెలుగుచున్నది. సాయిధుని విభూతిచే భక్తుల వ్యాధులు, ఇతర అనేక బాధలు దూరము చేసేవారు. ఇప్పటికిని ఈ ధుని విభూతి భక్తుల బాధలు దూరము చేయుచున్నది. సాయి, భక్తుల యొక్క ఊపిరితిత్తుల వ్యాధులు తాను తీసుకొని అనుభవించిన తర్వాత నాలుకతో సహా ఊపిరితిత్తులను బైటికి తీసి, నీటితో కడిగి, ఆరబెట్టి, తిరిగి వాటిని మ్రింగేవారు. భక్తుల ఇతర వ్యాధులు సాయి అనుభవించిన తర్వాత అఖండ యాగము చేసేవారు సాయి. అనగా శరీర భాగాలను విడివిడిగా చేసి, కొద్ది సమయము అలాగే ఉంచిన తర్వాత తిరిగి ఒక్కటిగా చేర్చేవారు. దీపాలు వెలిగించుటకు నూనె లభించకపోతే నీటితో అతి కాంతివంతముగా దీపాలు వెలిగించేవారు. ప్రక్క గ్రామములో నున్న భక్తుల బిడ్డను అగ్ని ప్రమాదము నుండి రక్షించుటకు ధునిలో తన చేయి పెట్టి కాల్చుకొనేవారు. సాయి శిరిడీ విడిచి ఎప్పుడూ వెళ్ళకపోయినా, వివిధ ప్రాంతాల్లోనున్న భక్తులకు ఒకే సమయములో దర్శనము ఇచ్చేవారు. భిక్షగా తెచ్చిన ఐదు రొట్టెల నుండి వందలాది ప్రజకు రొట్టెలు పంచి పెట్టేవారు. పంచభూతాలను శాసించేవారు, భక్తుల మంచి ఆలోచనలను ప్రోత్సహించి, ఆథ్యాత్మిక అభివృద్ధిని కలుగజేసేవారు. భక్తుల చెడు ఆలోచనలను ఖండించి వాటిని దూరము చేసేవారు అవతార శ్రీ శిరిడి సాయి ఆరాధన -