
SRI SRI SRI VAJRALA SUNKULAMMA DEVI GAANALAHARI
₹27
In stock · 9 available
PublisherDR.K.NAGALAKSHMI
LanguageTelugu
ఓం శ్రీ మాత్రేనమః స్పందన భగవంతునిపై అచంచల విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా తనను తాను సమర్పించుకోవడమే భక్తి. పరమ భక్తి ఉన్న వారి మనసు ఇహలోకంతో సంబంధాలు తెంచుకొని బ్రహ్మానందంలో మునకలేస్తుంది. రెక్కలు రాని పిట్టలు తల్లికై పరితపించినట్లు భక్తుల హృదయం భగవద్దర్శనమునకై తహతహలాడుతుంది. తాను ఉపాసించే దైవాన్ని తన ఆత్మగా సంధానించడమే భక్తి యొక్క పూర్ణ లక్షణం. ఆ పరిపూర్ణ దైవభక్తితో శ్రీమతి కె. నాగలక్ష్మి గారు తను నమ్మిన గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ వజ్రాల సుంకులమ్మ దేవి తత్త్వాన్ని, రూప లావణ్యాలను మనసారా కీర్తించి, జన సామాన్యానికి గీతాలుగా అందించి ధన్యులైనారు. కలియుగమున, భగవన్నామ సంకీర్తనము పరమాత్మను చేరుటకు సులభ మార్గమని విష్ణు పురాణంలో స్పష్టం చేయబడింది. దానికి తగ్గట్లుగానే శ్రీమతి నాగలక్ష్మి గారు ఆ జగదంబ శక్తి, వైభవములను “శతనామావళి" గా కూర్చి ప్రతి ఒక్కరు దేవీ నామ పారాయణం చేసుకొని తరించే అవకాశం కల్పించారు. శ్రీమతి నాగలక్ష్మి గారు వృత్తిరీత్యా బి.హెచ్.ఇ.ఎల్., ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ జన్మత: సిద్ధించిన సంస్కార ఫలితంగా భగవత్సేవతో పాటు, పేదలకు ఉచిత వైద్య సేవలందిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకోవటం ఎంతైనా ముదావహం. తల్లిదండ్రుల అభీష్టం మేరకు తమ స్వగ్రామమైన వీరా రెడ్డిపల్లెలో 'శ్రీశ్రీ శ్రీ వజ్రాల సుంకులమ్మ దేవి' ఆలయాన్ని నిర్మించి నిత్య పూజా కైంకర్యాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పర్యవేక్షించడమేగాక, దాని అభివృద్ధికై నిరంతరం తపిస్తున్నారు. వారి సేవా నిరతి, భక్తి తత్పరతలే వారి ఆశయ సాధనకు సోపానములవుతాయని నమ్ముతూ... ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములు వారికి.... వారి కుటుంబానికి సర్వత్ర రక్ష కాగలవని ఆశిస్తూ...