
SRI STUTHI MALA
₹60
In stock · 13 available
PublisherSRI MADHULATHA PUBLICTIONS
LanguageTelugu
శ్రీ స్తుతిమాల పుస్తక జ్ఞానం కన్నా, గురుమఖంగా, వేదం చేత ప్రతిపాదించబడిన పరబ్రహ్మ స్వరూపం తెల్సుకోవడమే చదువులలో కెల్లా పెద్ద చదువు అని అంటాడు ప్రహ్లాదుడు, ఈశ్వరుణ తెల్సుకోవటం చదువుల మర్మం. ఇది సరస్వతీ కటాక్షంతో లభ్యమవుతుంది. తెలియని 'తెల్చుకోవడమే విద్యా శ్రద్ధా స్తుతిస్తూ - ప్రయాణం చేస్తే సమస్త విద్యలూ మనుష్య జన్మలోనికి రావలసిందే అది అమ్మ వినయం రెండు కళ్ళుగా పెట్టుకుని గురువు చెప్పింది. కృపవలన సిద్ధిస్తుంది. అమ్మ కటాక్షం ఎక్కడుంటే అక్కడే భోగం, గౌరవం, నమస్కారం, అధికారం ఉంటుంది. పది మందికీ పనికి వచ్చేటట్లు బ్రతకడం, మనుష్య జన్మ ప్రయోజనం, భూమి రూపంలో అమ్మ మనకి సంపదలు ఇస్తే విష్ణువు, శివుడు అమ్మ అనుగ్రహం కోసం అద్భుతంగా స్తుతించారు. ఆ జగన్మాతను ఎన్ని రకాలుగా స్తుతించినా మనకు తృప్తి కలగదు. భక్తులమైన మనలను కన్న తల్లిలా కాచి, రక్షిస్తుంటుంది. ఏ దైవాన్ని ప్రార్థించినా శాశ్వతానందకరమైన ముక్తిని, శాశ్వతములైన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తుంది. సకల జీవావళికి సమస్త శక్తులను ప్రసాదించి, సమస్త విజయాలను, ఆనందాలను పొందేలా అనుగ్రహిస్తుంటుంది. అందుకే సకల దేవతలు, ఆ తల్లినే ఆశ్రయించి ఆమె కీర్తిని స్తుతిస్తుంటారు. మనమూ ఆ తల్లి అనుగ్రహానికై స్తుతిస్తు పూజిద్దాం. తల్లి ఆశీర్వాదాన్ని పొందుదాం. సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని నారాయణీ నమోస్తుతే॥ గుణాశ్రయే గుణమయి పరమాత్మను ఉపాసనా సాంప్రదాయాల్లో జగదంబ రూపంగా ఆరాధిస్తున్నాం. కన్నులు భావాల స్థానాలు, కాంతి క్షేత్రాలు, భాషా భావాలకీ, జగతికి ఇవే మూలశక్తులు, తన చూపులతోనే విశ్వాన్ని సంరక్షించి పోషిస్తోంది జగన్మాత. ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువును గమనించే తల్లి కటాక్షానికి అవధిలేదు. సర్వ జనుల మనోకామనల్ని కరుణనిండిన చూపులతోనే నెరవేర్చే లోకజనని. త్రికాలాలకు, త్రిలోకాలకూ ఓంకారంలేని అక్షర త్రయానికి సంకేతాలు ముగ్గురమ్మల సంకేతం. భగవంతుని మాతృ రూపంలో పూజించడమే దేవీ ఉపాసన అమ్మ మీద నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. నడిచేవారం మనమే ఐనా, నడిపించే శక్తి తల్లిదే. జగన్మాత శక్తి అపరిమతము. ధర్మాన్ని రక్షించేది శ్రీమాత. తల్లి కన్ను తెరిస్తే సృష్టి ఏర్పడుతుంది. మూసుకుంటే సృష్టి ఆగిపోతుంది. ఆ జగన్మాతే గొప్ప దైవం. మనం వ్యక్తం చేసే స్తుతి, ఆరాధన పూజ, సేవ అన్నీ అంతటా వ్యాపించిన తల్లికే చేరతాయి. సృష్టి మొత్తం శక్తి స్వరూపమే ఆ తల్లిని సుఖశాంతులు ప్రసాదించమని స్తుతిద్దాం. - డా|| పేకేటి గీతాశివరాం