
SRIDEVI BHAGAVATAMU
₹550
In stock · 46 available
PublisherMAHAKAVI DASU SREERAMULU
LanguageTelugu
ఆంధ్ర దేవీ భాగవతము పీఠిక నారంభించి ఆన 1900 సంవత్సరారంభమున గ్రంథకర్త దేవీభాగవతాంధ్రీకరణము యైదుమాసములలో నావని పూర్తిచేసి శుద్ధప్రతి నొకదానిని స్వహస్తమున వ్రాసి ముద్రణ కొసఁగిరి. కాని యా సమయమున వారి స్వకీయ ముద్రాక్షరశాలలో సర్కారును అధికముగ నుండుటచేతను, మువ్రాయంత్ర పరికరములు మితముగ నుండుటచేతను, నీగ్రంథము తమ ముద్రణాలయమున ముద్రించుట కవకాశము గలుగదయ్యె. కావున వితర ముద్రణాలయములలో నీకార్యమును నిర్వహించవలసిన యావశ్యకత గలిగినది. ఆకారణముచేత నీగ్రంథము 1997 వ సంవత్సరమువరకు బయలు వెడల వలను బడలేదు. అప్పటి కొక సంవత్సరమునకు ముందు గ్రంథకర్తకు శరీరమందు జాడ్యమేర్పడెను. సవరణపత్రములను మిక్కిలి జాగరూకతతో జూడ శ క్తి చాలక యుండెను. వారి శరీరము నానాటికి స్వాస్థ్యము తప్పుచుండుటయు, ము దణ మాలస్యముగ జరుగుచుండుటయు, దెలిసి కొని వెంటనే యప్పటికి ముద్రితముగాక నిలచియున్న చివరి యైదుస్కంధములు తమ ముద్రణాలయముననే పని జరుగున ట్లేర్పాటుచేసిరి. ఈ గ్రంథముయొక్క ముద్రణము ముగిసిన పదిమాసములలో గ్రంథకర్త మృతి జెందెను. సావధానముగ నీ గ్రంథమును తిరిగి వరిశీలించుటకుగాని ముద్రణా సాలిత్యము లను బరికించుటకుగాని తగిన యవకాశము గ్రంథక ర్తగారి జీవితకాలమున వారికి జిక్కకుం టచే నిందు నచ్చటచ్చట గొన్ని లోపము లుండునేమో యని శంక పొడమెడిని. అట్టి లోపము లెచటనైన గాన్పించినచో చదువరులు వానిని మాకు దెలుప వ్రార్జితులు. మొదటి ముద్రణ మితరస్థలములయందు జరిగిన కారణముచేతను, చిన్న యక్షరము లలో గూర్పబడి యుండుటచేతను జదువరుల కంటి కింపుగ నుండలేదు. ఇప్పుడు పెద్దయక్షరములలో గూర్పబడి విలువగల మంచి కాగితములపై ముద్రింప బడినది. ఈ గ్రంథముయొక్క కవితారచననుగూర్చియు, కనియొక్క ప్రజ్ఞావిశేషములను గూర్చియు, నిందు ముద్రింపబడిన బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి "శతావధానిగారి యుపోద్ఘాతమే చెప్పుచున్నది. కావున వేరుగ వ్రాయ నవసర ముండదు.