SRISAILEEYAM - SRISAILA KSHETRA GATHALU - USTAVALU - SHILPALU - STHUTULU by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

SRISAILEEYAM - SRISAILA KSHETRA GATHALU - USTAVALU - SHILPALU - STHUTULU

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శ్రీశైలఖండం చెప్పింది. శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే చాలు జన్మరాహిత్యం కలుగుతుందని దానర్థం. శ్రీశైల శిఖరమే కాదు! ఆ నేలలోని అణువణువూ పరమ పవిత్రమే. అటువంటి పవిత్రమైన క్షేత్రంలోని దర్శనీయస్థలాల విశిష్టతను వివరిస్తుంది ఈ గ్రంథం. శ్రీశైలంలో జరిగే ఉత్సవాలు- వాటి వెనుకున్న అంతరార్థాలను కళ్లకు కడుతుంది. శ్రీ కామాకీదేవి పూజాపి పురాణాలు మొదలుకొని అనేక కావ్యాలలో వర్ణించబడిన శ్రీశైల మాహాత్మ్యాన్ని మనకి వినిపిస్తుంది. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని స్తుతించే స్తోత్రాలు, పలు కీర్తనలను ఈ గ్రంథం తనలో ఇముడ్చుకుంది. స్వామి అమ్మవార్లపై తేలికగా లభించని కొన్ని అపురూప గద్యలను, రగడలను, దండకాలను కూడా ఈ గ్రంథంలో చూడవచ్చు. కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య శ్రీశైల ప్రభ మాసపత్రికలో ఉపసంపాదకులుగా పని చేస్తూ ప్రాచీన శ్రీశైల సాహిత్యంపై మక్కువతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి శ్రీశైలీయం పుస్తకాన్ని రచించారు. శ్రీ కామాక్షీదేవి పూజాపీఠమ్ పక్షాన వరుసగా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు వెలువడుతున్నాయి. అనేక ప్రాచీన గ్రంథాలు పరిష్కృతమై ప్రచురించబడుతున్నాయి.