
SRUNGARA SAKUNTALAMU
₹300
In stock · 230 available
PublisherPALAKODETI JAGANNATHARAO
LanguageTelugu
కేశిరాజు సీతారామయ్య దాదాపు 80-85 ఏండ్లకు పూర్వం కీ. శే. కేసిరాజు సీతారామయ్యగారు (క్రీ.శ. 1875-1960) రచించిన అచ్చతెనుగుకావ్యమే ఈ శృంగార శాకుంతలమహాకావ్యం. నల్గొండ జిల్లా కేసిరాజు వారి పల్లె నుండి శతాబ్దాలకు పూర్వమెప్పుడో? (1700-1725 A.D.) నల్గొండజిల్లా మెట్టవ్యవసాయాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాకు విస్తరించడానికై వలస వెళ్లిన క్రమంగా ఈ ఇంటి పేరు కేసిరాజు. ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధమైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ కవి వ్రాసిన కావ్యం ఉభయ తెలుగు రాష్ట్రాల అచ్చతెనుగు భాషకు వారధి. 3000 ఏండ్లకు పూర్వం నాటి ఐతరేయ బ్రాహ్మణకాలం నుండి వర్ధిలుతూ వచ్చిన అచ్చతెనుగుభాషలో "అచ్చ తెనుంగు పద్దెమొకటైనను కబ్బమునందు నుండినన్, హెచ్చని..." ప్రశసించే 16వ శతాబ్ది పూర్వకవులకు విస్మయావహంగా ఆభాషకు కావ్యనిర్మాణార్హమైన సుందర భాషాస్థాయిని కల్పించి ప్రథమకృతి (యయాతి చరిత్ర) రచించిన పొన్నికంటి తెలగన్న కవి ఆద్యకవిగా ఆరంభమైన అచ్చతెనుగు కావ్యపరంపరలో వచ్చిన ఆధునికమైన అచ్చతెనుగు కావ్యమిది. 1930 ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో పొడసూపే నవ్యాంధ్ర కవితారీతులకు, తదుపరి దూసుకొని వచ్చిన భావకవిత్వ-అభ్యుదయ కవిత్వాది నూతన కవితాధోరణుల ఆకర్షణకు గురిగాక తాను రచించిన ఈ అచ్చతెనుగు శృంగార శాకుంతలం (1930) సాహిత్యంలో నిలద్రొక్కుకోగలదా? అన్న భీతియే లేక క్రీ.శ.1959 లోనే పద్యకృతిని ముద్రించిన ఈ కవికి అచ్చతెనుగు మీదగల అచ్చమైన అభిమానం- నాడు సంస్కృత ప్రభావంతో, నేడు ఆంగ్లభాషాకర్షణతో తెలుగుభాష కనుమరుగై పోగలదేమోనని కేవలం గగ్గోలు పెట్టే ఆధునికాంధ్రభాషాభిమానులకు ఈ కావ్యం ఒక మేలుకొలుపు.