
STAMPULLO MAHATMUDU
₹60
In stock · 80 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
నా మాట నేను నా ప్రవృత్తిలో భాగంగా స్టాంపులు సేకరించటం, ప్రదర్శనలలో పాల్గొనడం మొదలుపెట్టాను. స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పతకాలను సాధించాను. స్టాంపులను సేకరించడం ఒక ఎత్తయితే / ప్రదర్శనకు తయారు చేయడం మరొక ఎత్తు. ఈ ప్రక్రియ చాల కష్టంతో కూడుకున్న పనే! వివిధ అంశాలకు సంబంధించిన శీర్షికలతో ప్రదర్శనను థియోమెటిక్ కలెక్షన్ అంటారు. ఇలా నేను వివిధ ప్రదర్శనల కోసం " The Great personalities of India', 'The Marviolous women', Transportation, Education, The unique Relationship వంటి ప్రదర్శనలు తయారుచేసి ప్రదర్శించాను. 2014వ సంవత్సరంలో 'అహింసా పెక్స్'కు ప్రదర్శన కోసం గాంధీ స్టాంపులను ఒక చోట చేర్చినందుకు నాకు కాంశ్య పతకం లభించింది. ఈ గ్రంథ రచనకు అది అంకుర్పారణం. సైకిల్ తొక్కుతూ ముందుకు దూసుకుని వస్తున్న గాంధీ చిత్రాన్ని ప్రత్యేక కవరుపైన చూస్తుంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపించింది. ఆయనని గురించి అందరికీ - ముఖ్యంగా బాలలకి చెప్పాలనిపించింది. చెప్పడంలో భిన్నత్వం ఉట్టిపడాలి. ఇదీ నా ఆలోచన. వివిధ స్టాంపులలో గాంధీ - గాంధీ మహాత్ముడిగా మారిన వైనాన్ని వివరించే నేపథ్యంలో / వివిధ దుస్తులతో స్టాంపులలో దర్శనమిచ్చిన గాంధీని గురించి తెలియజేస్తే ఎలా వుంటుంది? ఆలోచించాను. అబ్బురపరచేట్లు భిన్నకోణాల్లో గాంధీజీని చూపించి తొలిరోజుల నాటి గాంధీని భారత ఫిలాటెలిస్టులకే కాదు ప్రపంచ ఫిలాటెలిస్టులకు అందించిన ఘనత భారత తపాలాశాఖది. మన స్టాంపుల ప్రపంచాన్ని అంబరంలో నిలిపిన భారతీయ తపాలాశాఖను అభినందిద్దాం. నా రచనలు పుస్తకాలుగా రావాలని నా కంటె ఎక్కువగా ఆకాంక్షించి సూచనలు, సలహాలను ఆశీస్సులను అందించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆత్మబంధువు శ్రీ గుత్తికొండ సుబ్బారావుగారికి, ప్రధాన కార్యదర్శి, తెలుగు భాషా వైద్యులు, శతాధిక గ్రంథకర్త, డా॥ జి.వి.పూర్ణచంద్ గారికి నా నమోవాకములు. ముందుమాట వ్రాసిన స్నేహశీలి, బహుభాషాకోవిదురాలు, ప్రముఖ రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్ డా॥ కె.బి. లక్ష్మి గారికి ధన్యవాదములు. ఈ పుస్తక డిటిపి ప్రతిని ఎప్పటికప్పుడు ఫ్రూఫ్డింగ్ చేసిన ప్రముఖ బాలసాహితీవేత్త, బాలబాంధవి, మిత్రురాలు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి గారికి కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు నా వృత్తిలోను, ప్రవృత్తిలోను నా అభివృద్ధిని ఆశించి తోడ్పడిన నా తల్లి శ్రీమతి పుట్టి సరోజిని, తండ్రి స్వర్గీయ శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు గార్లకు నా నమస్సుమాంజలి. నా కుటుంబసభ్యులందరికి ధన్యవాదములు.