
STHAPATYA VIDYA
by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA
₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య విజయవాడలో,సంప్రదాయ వైదిక శిల్పాచార్య కుటుంబంలో బ్రహ్మశ్రీ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మ, వెంకటనరసమ్మ దంపతులకు జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం, ధర్మగిరిలో 8 సంవత్సరాల పాటు శైవాగమం అధ్యయనం చేశారు. శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి ఆగమశాస్త్రంలో ఆచార్య (ఎం.ఏ) పట్టా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్మదాయశాఖలో శిల్పశాస్త్ర అనువాదపథకంలో పండితులుగా చేరిన వీరు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన కాశ్యపశిల్పశాస్త్రం (మొదటి భాగం) గ్రంథాన్ని అనువదించారు. కర్ణాటక శిల్పకళా అకాడెమి వారి 'కర్ణాటక సంప్రదాయ శిల్పగురుకుల కేంద్ర'లో బి.ఎఫ్.ఏ.ఎమ్.ఎఫ్.ఏ కోర్సుల సిలబస్ కమిటీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా, ఆగమశాస్త్రపండితుడిగా, విషయనిపుణుడిగా ఉద్యోగించారు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పాండిత్యం గల వీరు పలు సెమినార్లలో పాల్గని ఆగమ, శిల్పసంబంధమైన పరిశోధన పత్రాలు సమర్పించారు. శిల్పకళాభారతి, కందుకూరి యామబ్రహ్మయాచార్య శిల్పవ్మాయపీఠం ద్వారా వాస్తు-శిల్పశాస్త్రగ్రంథాల్ని, శివాగమజ్ఞానవాహిని సంస్థ ద్వారా ఆగమశాస్త్ర గ్రంథాల్ని వెలువరిస్తున్నారు.. పలువురు పీఠాధిపతులు.. మంత్రులు.. ప్రముఖుల ప్రశంసలు.. ఆగమవిద్వాన్.. శాస్త్రప్రవీణవంటి బిరుదులతో సన్మానాలు అందుకున్నారు. పలు పత్రికలలో ఆధ్యాత్మిక కాలమిస్టుగా సుమారు రెండువందల వ్యాసాలు రచించారు. శ్రీశైల దేవస్థానంవారి శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక మాసపత్రికలో సహాయసంపాదకుడిగా ఉద్యోగించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎన్నారై ఫండ్స్ కో ఆర్డినేటర్ గా ఉద్యోగిస్తున్నారు.