STOCK MARKET LO LABHALU PONDADAM ELA - 120 by SRINIWAS Telugu book cover

STOCK MARKET LO LABHALU PONDADAM ELA - 120

by SRINIWAS

₹120
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ముందు మాట స్టాక్ మార్కెట్ ఈ మాట వినగానే చాలామంది దానిని ఒక భూతంలాగా లేదంటే ఒక జూదశాలగా చూస్తారు తప్ప దానిని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అసలు చూడరు. ఎందుకంటే చాలా మంది దానిలో ప్రవేఃశించి రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ, అవగాహన లోపం మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే తగు పరిజ్ఞానం, మంచి ప్రణాళిక తో స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తే దీనిలో పొందిన రాబడి ఇక మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో కూడ పొందలేరు. మార్కెట్ అనలిస్టు గా నా ప్రత్యక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు. దానితో వారు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అని నిందిస్తూ అది మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి టమాటాలు కొనేటప్పుడు ఐదు నిమిషాలు దానిలో పుచ్చులు ఉన్నాయా లేవా అని చూడటానికి కేటాయించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే దానికి కూడా తగిన సమయం కేటాయించి కావలసిన విజ్ఞానం పొందాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. లెర్నింగ్ చేస్తే ఏర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ ఉండదు. ఏదో పొద్దున లేచాం కంప్యూటర్ ముందు కూర్చున్నాం ట్రేడింగ్ చేసాం అంటే తప్పకుండా నష్టపోవలసి ఉంటుంది. "యద్భావం తద్భవతి" అని భగవద్గీత చెప్తుంది. అనగా ఏది అనుకుంటే అదే జరుగుతుంది అని దాని సారాంశం. మన ఆలోచనలను బట్టే, చేసే పనులు, మన నిర్ణయాలు ఉంటాయి. మార్కెట్పై మనకు ప్రతికూల ఆలోచనలు, నష్టాలు వస్తాయి అనే భయం ఉంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి. "Attitude is everything"