
STOCK MARKET TECHNICAL ANALASIS CHART PATERNS
by SRINIWAS
₹120
In stock · 11 available
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068510
ముందు మాట స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్ధతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్ మార్కెట్ అనలిస్టు గా నా ప్రత్యక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు. దానితో వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అనీ నిందిస్తూ అది మనకు అర్ధం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇంకా చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే భయంతో దూరంగా ఉన్నారు. మన దేశ జనాభాలో కాని, రాష్ట్ర జనాభాలో కాని కనీసం రెండు శాతం మించి డిమ్యాట్ ఖాట్యలు లేవు. ఎందుకటే మార్కెట్ పై అవగాహనా లేకపోవడమే. నేను ఇది వరకు వ్రాసిన స్టాక్ మార్కెట్ లాభాలు పొందడం ఎలా? పుస్తకం ద్వారా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? దానిలో అందరూ చేసి తప్పులు ఏమిటి? ఏ విధంగా లాభాలు పొందాలో వివరంగా వ్రాయడం జరిగినది. ఈ పుస్తకం ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి మరొక్కరి పై ఆధారపడటం కాని, అవగాహనా లోపంతో పెట్టుబడి పెట్టి నష్టపోకుండా మీరే స్వయంగా టెక్నికల్ అనాలసిస్ ను విశ్లేషించి స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు అందించే సాధనం ఛార్ట్ పాటర్న్. మార్కెట్ గురుంచి పూర్తిగా లెర్నింగ్ చేసి, పూర్తి అవగాహన కలిగించుకొంటే లాభాలు పొందడం చాలా సులభం. ఈ పుస్తకంలో మీకు టెక్నికల్ అనాలసిస్ ఛార్ట్ పాటర్న్స్ అంటే ఏమిటి? అవి ఏవిధంగా ఏర్పాటు అవుతాయి. వాటిలో గల రకాలు, ఏ పాటర్న్ ఏర్పాటు కాబడినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళుతుంది. ఏ పాటర్న్ ఏర్పాటు కాబడినప్పుడు క్రిందికి వెళ్ళుతుంది. ఏ పాటర్న్ ఏర్పాటు జరిగినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది. మొదలగు వివరాలు తెలుసుకోగలుగుతారు. మనం సాధారణంగా విన్నది, చదివినది చాలా త్వరగా మర్చిపోతాం కాని, చూసినది చాలా వరకు గుర్తు ఉంటుంది అందువలన ఈ పుస్తకంలో ప్రతి పాటర్న్ కూడా ఇమేజేస్