STREE - CHALAM SAHITYAM by CHALAM Telugu book cover

STREE - CHALAM SAHITYAM

by CHALAM

₹225
In stock · 38 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199677920
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “చలానికి ప్రశంసలను, అభిశంసలను విస్తృతంగా తెచ్చిన గ్రంథం ఇది. ఇంగ్లాండులో ఉండగా జరిగిన ఒక గోష్టిలో Man and the Woman వాద్యం ఇంగ్లీషులో వ్రాసి చదివారు. దాన్నే తరువాత విస్తరించి ‘స్త్రీ’ పేరున తెలుగు రచన చేశారు. ‘స్త్రీ’ పురుష సమసమాజం గురించి చలంగారి అభిప్రాయం స్పష్టంగా తెలియజేసిన ఈ సిద్ధాంత రచనను చదివి తీరాలి. ఈ పుస్తకానికి మల్లె మల్లె ద్రాసిన వారి ముందుమాటలను చదవడం కూడా అవసరం. ‘స్త్రీ’ స్వాతంత్ర్య విషయమై తాను ఆరంభించినదేమిటో శంకకు తావు లేకుండా చెప్పారు. ఈనాటికీ అంగీకరించడానికి ఎవరైనా వెనుకాడేంత పురోగామిగా చలం ఆనాడే రాశారు. అందుకే చలం ముందుతరాల రచయిత. – డా॥ వాడ్రేవు సుబ్బారావు