SUBRAHMANYA STHUTHI MANJARI by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

SUBRAHMANYA STHUTHI MANJARI

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹116
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
సుబ్రహ్మణ్య స్తుతిమంజరి ఆగమ, పురాణాలలో స్తోత్రాలు గద్యలు దండకాలు శిల్పకళాభారతి ఇది సుబ్రహ్మణ్య స్తోత్రాల కదంబం. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు అనేకం ఉన్నాయి. వాటినుంచి సుప్రసిద్ధమైనవి, అరుదుగా లభ్యమయ్యే స్తోత్రాలను ఏర్చి కూర్చిన గ్రంథరాజమిది. ఈ స్తోత్రాలన్నీ వివిధ పురాణాలనుంచి సేకరించినవి. కుమారతంత్రం వంటి తంత్రగ్రంథాలలో మాత్రమే లభ్యమయ్యే స్తోత్రాలు. ఇవి మాత్రమే కాకుండా సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య శరణాగతి గద్యలు, దండకాలు, స్కందోపనిషత్తు, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలు మొదలైనవన్నీ ఈ గ్రంథంలో లభ్యమవుతాయి. గోపాలకృష్ణకవి విరచితమైన సుబ్రహ్మణ్య కర్ణామృత స్తోత్రం ఈ గ్రంథానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సుబ్రహ్మణ్య భక్తులు ప్రతిదినం స్తోత్ర పారాయణ చేసుకోవడానికి అత్యంత ఉపయుక్తమైన గ్రంథమిది. సుబ్రహ్మణ్య స్వామి కి సంబంధించి ఈ గ్రంథంతో పాటు "సుబ్రహ్మణ్య రూపమంజరి" అనే గ్రంథం కూడా కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య నుండి వెలుబడడం ఇక్కడ ప్రస్తావించవలసిన అంశం.