
SUPER 30 VISANARIES
by SUNIL DAVALA
₹250
In stock · 1 available
PublisherSUNIL DAVALA
LanguageTelugu
ISBN9788194449904
పుస్తకం గురించి ఈ దార్శనికులందరూ విజయాన్ని సునాయాసంగా అందుకోలేదు. పలు మార్లు విఫలమైనప్పటికీ దిగాలు చెందలేదు. ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన నిరాశ పడనూలేదు. పడి లేచిన కెరటంలా పుంజుకున్నారు. ఆటుపోటలను తట్టుకుని అంకిత భావం, కఠోర శ్రమతో ప్రయత్నాలను కొనసాగించారు. వారి పోరాట పటిమ అసాధారణం. జీవితంలో ఒక్కో అడుగు వేస్తూ ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకున్నారు. అందిన అవకాశాన్నల్లా ఉపయోగించుకొని ఆయుధంగా మల్చుకున్నారు. వీరందరి వయస్సు, దృక్పథం, సామజిక నేపథ్యం, లక్ష్యం వేరు కావచ్చును. కానీ వీరందరిలో ఉన్న ఉమ్మడి అంశాలు వీరందరినీ విజేతలుగా నిలిపాయి. వారు కన్న కలలను సాకారం చేసుకోడానికి శక్తి యుక్తులా ప్రయత్నించారు. తొలుత వారిపై వారికి నమ్మకం, విశ్వాసం పెంచుకొన్నారు. ఎవరూ ప్రయాణించని మార్గాన్ని అన్వేషించి కొందరు ఎన్నుకొంటే, తమ లక్ష్యసాధన కోసం సరికొత్త బాటను వేసుకొన్నవారు మరికొందరు. జీవిత ప్రారంభంలో బ్రతుకు తెరువు కోసం ఒకరు జట్కా నడిపితే మరొకరు బంట్రోతుగానో, రోజుకూలీగానో పనిచేసేరు. ఒక వైపు ఆర్థిక స్థితిగతుల వలన పెద్దగా చదుకోలేకపోయిన వారున్నారు. మరో పక్క ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఆశయ సాధన కోసం ఉద్యోగం వదులుకొన్నవారున్నారు. వీరందరూ సాధారణ వ్యక్తులే, కానీ అసాధారణమైన విలక్షణతలను పెంపొందించుకొని గమ్యాలను చేరుకుని విజయాన్ని అందుకోగలిగేరు... జీవితాన్ని "పరిపూర్ణం" చేసుకోగలిగేరు. వీరి దూరదృష్టి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత, ఆలోచనా శక్తి, సంకల్ప బలం, పరిణతి, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు, దృఢ నిశ్చయం, సేవా నిరతి ప్రతి సాధారణ వ్యక్తిని ఆలోచింపచేస్తాయి. ఆచంచల అకుంఠిత ఆత్మవిశ్వా సం పెంపొందిస్తాయి. తమలో ఉన్న శక్తి, యుక్తులను మేలుకొలిపి ఆ దిశగా ప్రయాణం సాగించి అవకాశాలను అన్వేషించడానికి ప్రోత్సహిస్తాయి. తొలి సారి ప్రయత్నించి విఫలమై, తిరిగి ప్రయత్నించి ఓటమి పాలైనా, ఆత్మవిశ్వాసంతో మరలా ప్రయత్నాలను కొనసాగించేందుకు వీరి జీవన పోరాటం స్ఫూర్తి, ప్రోత్సాహం కలిగిస్తుంది. పరిస్థితులతో రాజీ పడ లేక నిరంతరం ఘర్షణ చెందే యువత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, వ్యాపార వ్యక్తులు, గృహిణులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు మరియు కార్పొరేట్ సంస్థలకు ఈ దార్శనికులు మార్గదర్శకం. సూపర్ 30 విజనరీస్ పుస్తకంలో వారి భాగస్వామ్యులు, రెండో తరం వ్యాపారవేత్తలతో కలిపి ముప్పైకి పైగా దార్శనికుల ప్రస్తావన ఉంది. ఈ నిజ జీవిత కథలు పుస్తకరూపంలో తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.