SUPRASIDHA BHARATEEYA KAVULU. RACHAITALU by ADELLA SIVAKUMAR Telugu book cover

SUPRASIDHA BHARATEEYA KAVULU. RACHAITALU

by ADELLA SIVAKUMAR

₹30
In stock · 2 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
వేదవ్యాసుడు వేదవ్యాసుడు - 'పంచమ వేదం'గా పేర్కొనబడిన 'మహాభారతం' పురాణ గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుని గురించి తెలియని సాహిత్యకారుడు ఉండడు. అష్టాదశ పురాణాలను, ఉపనిషత్తులను రచించిన వ్యాసున్ని 'కృష్ణ ద్వైపాయనుడ'ని కూడా పిలుస్తారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, ప్రపంచానికి తెలియ జెప్పినందుననే అతనికి 'వేద వ్యాసుడ'నే పేరువచ్చింది. మహాభారత ఇతి వృత్తాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వేదవ్యాసుడు, ద్వాపరయుగాంతాన ఆ ఇతివృత్తాన్ని 'మహాభారతం'గా విఘ్నేశ్వరుని సహకారంతో అక్షరీకరించాడు. మహాభారతంలో లేని ధర్మసూత్రం లేదు. భారతీయులు/హిందువుల పవిత్రగ్రంథం 'భగవద్గీత' కూడా వ్యాస విరచితమే. అందుకే భారతాన్ని 'పంచమవేద' మంటారు. ప్రపంచ సాహితీ రంగానికి ఇంతటి విలువైన గ్రంథాన్నిచ్చిన వ్యాసుడు ప్రాతః స్మరణీయుడు.