
SURAVARAM PRATAPA REDDY RACHANALU - 2 KATHALU
₹150
In stock · 356 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చిన్న కథ తెలుగు సాహిత్యంలో చిన్న కథ కొత్త ప్రక్రియ కాదు. అఖ్యాయిక, ఖండ ద కథ పరి కథ కళానిక అని గద్య కావ్యము ఐదు విధాలుగా విభజన చేయబడడి. కథా వస్తువునుబట్టి దివ్య కథ, దివ్య మానుష కథ అనే విభాగం కూడా అగ్ని పురాణంలో స్పష్టంగా వివరించ బడ్డదని సాహితీవేత్తలు చెబుతున్నారు. తెలుగు భాషలోని పద్య కావ్యాలలో అవాంతర కథలుగా చిన్న చిన్న కథలు అనేకంగా ఉన్నాయి. శుక సప్తతి, హంస వింశతి, విక్రమాదిత్య చరిత్ర, దశ కుమార చరిత్ర, పంచ తంత్ర కథలు, బృహత్కథ నాధారంగా చేసుకుని రచింపబడిన కథా సరిత్సాగరము సంస్కృతమునుండి తెలుగులోకి అనువదింపబడిన కథలు, ఇవేకాక - 19వ శతాబ్దపు గుజరీ పుస్తకాలలో కాశీమజిలీ కథలు, భేతాళ పంచ వింశతి కథలు, రామలింగడి కథలు మొదలైనవి అనేకంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క వ్యక్తి నాశ్రయించిన కథా మాలలు, అయితే పైన చెప్పబడిన కథా వాఙ్మయమంతా పద్యములోను, సంస్కృత పద భూయిష్టమైన గద్యములోను ఉన్నది. ఆ కథా వాఙ్మయమంతా పండితా ధీనమైనది. అక్షర జ్ఞానము గల స్త్రీ పురుషులకు సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలనే సంకల్పంతో కందుకూరి, చిలకమర్తి, గురజాడ మొదలయిన పండితులు సులభశైలిలో స్త్రీ విద్య, ప్రౌఢ వివాహాలు, వితంతు వివాహాలు, మూఢ నమ్మకాలవల్ల కలిగే నష్టాలు మొదలైన సంఘ సంస్కరణోద్యమ ప్రధానంగా నవలలు, నాటకాలు, ప్రహసనాలు, కవితలు మొదలైన రచనలు ప్రారంభించారు. ఆంగ్ల భాషాభ్యాసము వల్లనూ దాని ప్రభావం వల్లనూ ఆధునికులలో చైతన్యం కలిగింది. తత్కారణంగా