SURAVARAM SUDHAKARA REDDY - (VYASALU - LEKHALU) by V.RAM NARSIMHA RAO Telugu book cover

SURAVARAM SUDHAKARA REDDY - (VYASALU - LEKHALU)

by V.RAM NARSIMHA RAO

₹200
In stock · 73 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట ఐదు దశాబ్దాలు పైబడిన కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి క్రియాశీల రాజకీయ జీవితం స్ఫూర్తిమంతం, ఆదర్శప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి ఉద్యమం నాయకునిగా, జాతీయ స్థాయిలో విద్యార్థి (ఎఐఎస్ఎఫ్), యువజన (ఎఐవైఎఫ్) సమాఖ్యల ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నో ఉద్యమాలు నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. 2012లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. అనారోగ్య కారణంగా స్వచ్ఛందంగా బాధ్యతల నుండి తగ్గి పార్టీకి పెద్ద దిక్కుగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన స్వాభావికంగా సౌమ్యుడిగా కనిపించినా, తన భావాలను కరాఖండీగా వ్యక్తం చేయగల దిట్ట. చక్కని వాగ్దాటి ఆయన సొంతం. 1998లో, తిరిగి 2004లో నల్లగొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనారు. పార్లమెంట్ సభ్యునిగా రాణించటానికి రాజకీయ అనుభవం, విషయ స్పష్టత, వ్యక్తీకరణ సౌలభ్యం దోహదం చేశాయి. ఆయన సభ లోపల నుంచి తొలుత వాజ్పేయ్ ఎన్టిఎ ప్రభుత్వంతో, ఆ తదుపరి యుపిఎ ప్రభుత్వ విధానాలపై నిర్విరామ పోరాటం చేశారు. విదేశాలలో దాచుకున్న నల్లడబ్బు అంశాన్ని ప్రధానమంత్రికి లేఖ ద్వారా లేవనెత్తి పార్లమెంట్లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మితవాద, మతవాద శక్తులు ఆధిక్యతతో ఏర్పడిన రెండవ ఎన్టిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, తిరోగమన నియంతృత్వ ఫాసిస్టు విధానాలను వ్యాసాల ద్వారా, ప్రభుత్వానికి లేఖల ద్వారా ఎండగట్టారు. అటువంటి వాటినుంచి ఏరిన రచనలు ఈ గ్రంథ రూపంలో వెలువడినాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతినెల రేడియో ద్వారా వినిపించే “మనసులో మాట" -నిజానికి విలువలేని “నోటిమాట” మాత్రమే అన్న సుధాకరరెడ్డి అభిప్రాయం ఆలోచన రేకెత్తిస్తుంది. మోడీ తొలి ప్రభుత్వకాలంలో అమలు చేసిన, కార్పొరేట్ అనుకూల విధానాలను; అభ్యుదయవాదులకు, దళితులు, మైనారిటీలకు వ్యతిరేకమైన అసహన రాజకీయాలను, హేతువాద మేధావులు, రచయితలైన సరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎం. ఎం. కాల్బుర్గిలను మతోన్మాదులు హత్య చేయటానికి వ్యతిరేకంగా పెక్కుమంది ప్రసిద్ధ రచయితలు తమ అవార్డులు తిరిగి ఇచ్చివేయటాన్ని ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దుష్పరిణామాలను విశ్లేషించిన వ్యాసం, ప్రధానమంత్రి దేశానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.