
SURI GUNA GANAM
₹150
In stock · 33 available
PublisherPROF.RAVIKANTI VASUNANDAN
LanguageTelugu
సుకృతి డా. శ్రీరంగాచా భూతం సరశ్చమహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రరేణు పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్. పన్నిద్దరాళ్వారుల గూర్చిన యీ శ్లోకం శ్రీ వైష్ణవ భక్త శిఖామణులకనుదినా స్తోత్ర పారాయణంలోనిది. సూర్యులు 12 మంది. వారి తాపతీవ్రత భరించుట సాధ్యం కాదు. కాబట్టి ఈ ద్వాదశ సూరులనబడే ఆళ్వారులవతరించి తమ హృదయ పంకజముల నుండి నిసర్గ సుందరంగా వెలువడిన మధుర మధుప్రవాహంచే మురారిని సొక్కించి ధన్యాత్ములై సూర్యతాపమునిట్లు దూరం చేసినారని అభియుక్తోక్తి. అందుకే శ్రీకృష్ణదేవరాయల వారు అలపన్నిద్దరు సూరులందున... అని గొప్ప పద్యాన్ని చెప్పినారు. శ్రీ వైష్ణవం భక్తిప్రధానమైనదని, ఉచ్చ నీచములు లేవని చాటిచెప్పిన మహానుభావులు ఆళ్వారులు. వీరి వలననే శ్రీవైష్ణవం అత్యంత ప్రచారమై వ్యాప్తి చెందినది. దానికి కారణం ఆళ్వారులు ప్రవచించిన ద్రావిడ కృతులు. వీరి కృతులన్నీ కలిపితే 'నాలాయిరం' (నాలుగు వేల పాశురాల గ్రంథం) అయ్యింది. వేదపఠనాధికారం సర్వజనసాధ్యంకాని రోజుల్లో వేదసారాన్ని తమిళంలో సులభశైలి పాశురాల రూపంగా అందించి వ్యాప్తి చేసిన వారు భిన్నకాలాలకు చెందిన ఈ ఆళ్వారులు. భగవద్గుణానుభవం నిరర్గళంగా ఆకాశగంగవలె వీరి వాక్కుల నుండి ద్రావిడ భాషారూపంగా వెలువడినందున వీరికి ఆళ్వారులని పేరు వచ్చింది. (ఆళ్వారు అనగా కాపాడు వారు అని అర్థం). భగవదనుభవ పరీవాహరూపమైన భక్తిసాగరంలో రాగతాళయుక్తముగా నిబంధించి నాలాయిర మొనర్చినారు. ద్వాదశసూరులలో నమ్మాళ్వారులు శరీరం. ఇతర ఆళ్వారులు వీరికి కరపాదాద్యవయవప్రాయులు. ఈ కవిచతురాననుడు మహాముని. వీరికే శఠకోపులని నామాంతరం.