
SUSWARALA RAYUDU RAMESH NAIDU
₹225
In stock · 1 available
PublisherVIPLAVA RACHAITALA SANGAM
LanguageTelugu
ముందు మాట ! ముందొక మాట, వెనకో మాట చెప్పడం, రాయడం నాకు అలవాటు లేదు ! ఏదైనా ముందు మాటే ముక్కు. సూటి మాటే! సుస్వరాల రమేష్ నాయుడు పుస్తకం చదువుతుంటే, మ్యూజికల్ టైమ్ మిషిన్ లోకి వెళ్ళిపోయాను . చిన్నప్పటి నుంచి సినిమాలు పుస్తకాలు,పాటలు అంటే నాకు ఇష్టం, పిచ్చి ! అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న ఏడెనిమిదేళ్ళ వయసు చందన అనే సినిమాకి తీసుకెళ్లారు ఇంట్లో , వాళ్ళు! ఓ రామ సక్కని బంగారు బొమ్మా ! " అనే పాట మొదలైంది . ఆ కంఠం లోని ఒక విషాదపు బరువు .. ఎందుకో గుండెల్లో హత్తుకుపోయింది . జీవిత కాలాన్ని వెంటాడే తప్పించుకోలేని Melancholy! హుషారు పాటలా పడుకునే పసి వయసులో నేను ఈ పాటని వెంటపెట్టుకుని తిరుగుతుండే వాడిని! 1974డిసెంబర్ 6- విజయ వాడ అలంకార్ థియేటర్! ఆ ముందు రోజే (డిసెంబరు 5 ) నా పుట్టిన రోజు గాబర్త్ డే సెలబ్రేషన్ కృష్ణ సినిమా తో చేసుకుందామని దేవదాసు సినిమా కి వెళ్ళిపోయాను ! Melancholy తగులుకుంది. ఇది నిశీధి సమయం అనే పాట మొదలైంది. గుండె బరువెక్కింది, కళ్ళు కాదు - గుండె చెమర్చడం మొదలైంది! వెనక్కి తిరిగి చూస్తే - వెనక సీట్లో నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు, విజయ నిర్మల గారు. ఆ సినిమా మార్నింగ్ షో కి వచ్చారు . మాధుర్యానికి అవతలి నాణెం విషాదం అని, ఒకే స్వరం - ఒకే రాగం తో గుండె పట్టలేని ఆనందం, గుండె బరువెక్కే దుఃఖం కలిగించే వాడే సంగీతాల గారడీ వాడు అని నాకు తెలియజేయమనా మొదటి వాడు రమేష్